మాస్కో సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ); రష్యాలో 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం అత్యవసరంగా పొలాల్లో దిగింది ఉరల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం ఇవాళ నోవోసిబిర్స్క్ ప్రాంతంలో ఉన్న కామెనేకి గ్రామం వద్ద ఉన్న పొలాల్లో ల్యాండిరగ్ అయ్యింది. ఎయిర్‌పోర్టులో దించేందుకు ప్రయత్నం చేసినా.. ఆ విమానం రన్‌వే వరకు వెళ్లలేకపోయింది. దీంతో అత్యవసరంగా ఆ విమానాన్ని .. గోధుమ పొలంలోనే దించేశారు. ఎయిర్‌బస్ ఏ320 విమానం.. సోచి నుంచి ఓమ్స్క్‌కు వెళ్తోంది. మార్గమధ్యలో ఎమర్జెన్సీ సందేశం రావడంతో.. ఆ విమానాన్ని నోవోసిబిర్క్స్‌కు పంపే ప్రయత్నం చేశారు. కానీ ఆ విమానం మధ్యలోనే ల్యాండ్ అయ్యింది. నోవోసిబిర్క్స్‌కు సుమారు 180 కిలోవిూటర్ల దూరంలో దాన్ని దించారు. హైడ్రాలిక్స్ లోపం తలెత్తడంతో విమానాన్ని ల్యాండ్ చేశారు. 170 మందితో వెళ్తున్న ఆ విమానంలో 23 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఎమర్జెన్సీగా పొలంలో దిగినా.. ఆ విమానం ముక్కలు కాలేదు. అగ్నిప్రమాదం కూడా జరగలేదు. ప్లేన్ నుంచి ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయకు వచ్చారు. ఆ పోలాల్లోనే ప్రస్తుతం వాళ్లంతా ఎదురుచూస్తున్నారు.
170 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అత్యవసరంగా పొలాల్లో లాండిరగ్
బుధవారం, సెప్టెంబర్ 13, 2023
0
Tags