Ticker

6/recent/ticker-posts

Ad Code

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఈనెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిరది. రాబోయే 3 రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో.. ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు..గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌..పార్వతీపురం, అల్లూరి, ప్రకాశం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు