Ticker

6/recent/ticker-posts

Ad Code

13 అడుగుల పొడవున్న గిరినాగు పట్టివేత


అనకాపల్లి సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ );అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగు ఒకటి పట్టుబడిరది. గ్రామానికి చెందిన రైతు ఎలమంచిలి రమేశ్‌ తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ గిరినాగు రాత్రి కోళ్లను వెంబడిస్తూ వాటి గూట్లోకి దూరింది. గమనించిన రైతు వెంటనే పాములు పట్టడంలో నిపుణుడైన వెంకటేశ్కు సమాచారం అందించాడు. ఆయన వచ్చి దాదాపు 20 నిమిషాలు శ్రమించి పామును పట్టుకున్నాడు. అనంతరం దానిని అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి సవిూపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు