Ticker

6/recent/ticker-posts

Ad Code

1000 కోట్లకు చేరిన శ్రీ వాణిTRUST విరాళాలు

తిరుమల, సెప్టెంబర్‌ 5, (ఇయ్యాల తెలంగాణ ); హిందూ దేవాలయాలను పరిరక్షించేందుకు టిటిడి చేపట్టిన శ్రీవారి ట్రస్టుకి శ్రీవారి భక్తుల నుండి విశేష స్పందన వస్తుంది.. శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన నాలుగేళ్ళ కాలంలోనే వందల కోట్ల రూపాయల నిధులు ట్రస్ట్‌ కి చేకూరింది.. అసలు ఇప్పటి వరకూ శ్రీవాణి ట్రస్టుకి ఎన్ని కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది..? శ్రీవాణి ట్రస్టుకి భక్తులు విరాళాలు అందించే నిధులతో టీటీడీ ఏం చేస్తుందంటే..?అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతినిత్యం దేశ విదేశాల నుండి భక్తులు వివిధ రూపాల్లో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.. ఇలా చేరుకున్న భక్తులు వారి వారి స్తోమతకు తగ్గట్టు స్వామి వారికి కానుకలు సమర్పించి మొక్కలు చెల్లించుకుంటారు.. క్షణకాలం పాటు జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు రోజులు, గంటల తరబడి నిరీక్షించి స్వామి వారి దర్శన భాగ్యం పొందుతుంటారు.. ఒక్కో సమయంలో భక్తుల రద్దీ నేపధ్యంలో చాలా మందికి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించడం చాలా కష్టం కావడంతో శ్రీనివాసుడి దర్శనభాగ్యం చేసుకోకుండానే వెనుతిరుగుతూ ఉంటారు.. ఇందుకోసం భక్తులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, బడా పారిశ్రమిక వేత్తల నుండి సిఫార్సు లేఖలు పొంది విఐపి బ్రేక్‌ దర్శనం ద్వారా స్వామి వారిని దగ్గర నుండి చూసి ఎంత గానో పరవశించి పోతారు.. మరికొందరికి సిఫార్సు లేఖలు లభించక పోవడంతో చాలా మంది ఎంతగానో నిరాశకు గురి అవుతుంటారు.. తమ జీవిత కాలంలో ఒక్కసారి అయినా స్వామి వారిని కనులారా దగ్గర నుండి చూసే భాగ్యం దక్కితే చాలు తమ జన్మ ధన్యమైందని భావిస్తుంటారు.. అయితే ఇలాంటి వారి కోసమే టీటీడీ శ్రీవాణి ట్రస్టుని అందుబాటులోకి తీసుకొచ్చింది.. అయితే టిటిడి తీసుకొచ్చిన శ్రీవాణి ట్రస్టుకు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తుంది..అయితే ట్రస్ట్‌ ప్రారంభించిన నాలుగు ఏళ్ళు గడుస్తుంది.. ఈ నాలుగేళ్ళల్లో ఇప్పటి వరకూ 1000 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి.. 2019లో వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిటిడి ఛైర్మన్‌ గా వైవీ.సుబ్బారెడ్డి భాధ్యతలు స్వీకరించారు.. ఈ క్రమంలోనే ఏడుకొండల్లో దళారీ వ్యవస్ధను రద్దూ చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఒ1, ఒ,2, ఒ3 పద్దతిని పూర్తిగా రద్దు చేశారు.. అయితే ఈ విధానం రద్దు చేసిన తర్వాత విఐపి బ్రేక్‌ దర్శనానికి మరింత డిమాండ్‌ పెరిగింది.. దీంతో దళారులు తాము చెప్పిందే రేటుగా అమాయకులైన భక్తుల నుండి అధిక మొత్తంలో నగదును ఆర్జిస్తూ దళారుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూ వచ్చింది.. ఈ క్రమంలోనే 2018లో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టు ద్వారా పురాతన దేవాలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాలు నిర్మాణం, దేవాలయాలకు ధూపధీప నైవేద్యాలకు తోడ్పాటు అందించడలనే లక్ష్యంగా శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్‌ పేరుతో ఉన్న ట్రస్టుని టీటీడీలో అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీవాణి ట్రస్టులో కొన్ని మార్పులు తీసుకొచ్చారు..సనాతన ధర్మంను సంరక్షణలో భాగంగా 2019 అక్టోబర్‌ 21వ తేదీ నుండి శ్రీవాణికి రూ.10,000 విరాళం ఇచ్చిన దాతలకు ప్రివిలేజ్‌ క్రింద 500 రూపాయల విలువ గల ఒక సారి విఐపి బ్రేక్‌ దర్శనాన్ని టిటిడి కల్పించింది.. టిటిడి చేపట్టిన బృహత్తర కార్యక్రమంకు నిధులు వెల్లువెత్తాయి.. 2019లో రూ.26.25 కోట్లు విరాళంగా అందించి 19,737 మంది దర్శించుకున్నారు.. 2020లో రూ. 70.21 కోట్లు విరాళం రాగా, 49,282 మంది భక్తులు దర్శించుకున్నారు.. 2021లో  రూ. 176 కోట్లు విరాళంగా రాగా, 1,31,000 మంది భక్తులు దర్శించుకున్నారు.. 2022లో రూ. 282.64  కోట్లు విరాళంగా రాగా 2.70 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.. 2023లో ఇప్పటీ వరకు రూ. 268.35  కోట్లు విరాళాలు రాగా,1.58 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.. ఈ విధంగా గత నాలుగేళ్ల కాలంలోనే రూ.1000 కోట్లు విరాళం అందాయి.. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో 176 పురాతన ఆలయాల పునఃరుద్ధరణ పనులను టిటిడి ప్రారంభించింది..బీసీ,ఎస్సీ, ఎస్టీ కాలనీలో 2273 నూతన ఆలయాల నిర్మాణాలు ప్రారంభించడంతో పాటుగా, 501 ఆలయాలకు ధూపధీప నైవేథ్యం కింద ప్రతి నెల రూ.5 వేల చొప్పున టిటిడి చెల్లిస్తుంది.. అయితే ఇటీవల్ల కాలంలో శ్రీవాణి ట్రస్టు నిధులు పక్కదారి పడుతున్నాయనే వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల వినియోగంపై గత పాలకమండలి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి 2023 జూన్‌ 23 తేదీన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు..


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు