హైదరాబాద్ ఆగష్టు 10, (ఇయ్యాల తెలంగాణ ):నాంపల్లిలోని టీఎస్పీఎస్సి ముందు గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 2 పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటూ వేలాది మంది అభ్యర్థులతో టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని ముట్టడిరచారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్, తెలంగాణ జన సమితి తెలిపాయి. టిఎస్పిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర కాంగ్రెస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు. వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను పోలీసులుకార్యాలయం పక్కనున్న ఖాళీ గ్రౌండ్ లోకి పంపించి ట్రాఫిక్ క్లియర్ చేసారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
0 కామెంట్లు