Ticker

6/recent/ticker-posts

Ad Code

Telangana లో అమ్మకానికి మరిన్ని భూములు

హైదరాబాద్‌, ఆగస్టు 15, (ఇయ్యాల తెలంగాణ );హైదరాబాద్‌ శివారులో హెచ్‌ఎండీఏ నిర్వహిస్తున్న ఈ ` వేలాల్లో భూముల ధరలు ఊహించని ధరలు పలుకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో చోట ఈ ` వేలానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా మొకిలా ఫేజ్‌` 2 భూ వేలానికి హెచ్‌ఎండీఏ సోమవారం  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొకిలా వద్ద సుమారు 300 పాట్ల అమ్మకానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ 300 ప్లాట్లలో 98,975 గజాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ లేఔట్‌లో 300 నుంచి 500 గజాల ప్లాట్స్‌ను అందుబాటులో ఉంచింది. ఆగస్ట్‌ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించింది. రూ.1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో చదరవు గజానికి రూ.25 వేల రూపాయలు అప్సెట్‌ ధరగా నిర్ణయించారు. మొకిలా ఫేస్‌ ` 1లో గజానికి అత్యధిక ధర రూ.1.05 లక్షలు కాగా, అత్యల్పంగా రూ.72 వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫేజ్‌ ` 1లో ప్రభుత్వానికి యావరేజ్‌ గా ఒక్కో  గజంపై రూ.80,397 ఆదాయం వచ్చింది. ఇప్పుడు 98,975 గజాలకు గానూ సుమారు రూ.800 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


పేదల భూములను బీఆర్‌ఎస్‌ వ్యాపారులకు కట్టబెడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌ లో విూడియాతో మాట్లాడారు. కోకాపేటలోని ఏకంగా 11 ఎకరాల భూమిని  బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చింది నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ తో పాటు కాంగ్రెస్‌ కూడా కుమ్మక్కై వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయ పనుల్లో అవసరమయ్యే డబ్బులు కోసం ఇప్పటి నుంచే భూములను సమకూర్చుకుని.. అనంతరం వాటిని అమ్మి ఆ డబ్బులను ఎన్నికల టైమ్‌ లో ఉపయోగిస్తారని ఆయన మండిపడ్డారు. 

ముఖ్యమైన తేదీలు

ఆగస్టు 17` ప్రీ బిడ్డింగ్‌ విూటింగ్‌(లేఅవుట్‌ వద్ద)

ఆగస్టు 21 ` రిజిస్ట్రేషన్‌, అమౌంట్‌ డిపాజిట్‌ కు చివరి తేదీ

ఆగస్టు 23 ` ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు 30 ప్లాట్లు ఈ`వేలం

ఆగస్టు 24 ` మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 30 ప్లాట్లు ఈ`వేలం

ఆగస్టు 25, 28, 29 తేదీల్లో` రెండు సెషన్లలో రోజుకు 60 ప్లాట్లు చొప్పున ఈ`వేలం

మూడు జిల్లాల పరిధిలో స్థలాల విక్రయాలు


హైదరాబాద్‌ పరిధిలో మరోసారి భూముల ఈ`వేలానికి హెచ్‌ఎండీఏ రంగం సిద్ధం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌`మల్కాజ్‌ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల అమ్మకానికి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డిలోని బైరాగిగూడ, మంచిరేవుల, పీరంచెరువు, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్‌, చందానగర్‌ లో హెచ్‌ఎండీఏ స్థలాలు విక్రయించనున్నారు. మేడ్చల్‌`మల్కాజ్‌గిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం, సంగారెడ్డిలో వెలిమల, నందిగామ, అవిూన్‌పూర్‌,రామేశ్వరం బండ, పతిఘనపూర్‌, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని స్థలాలు విక్రయించనున్నారు. ఈ ప్రాంతాల్లో రామేశ్వరం బండ, నందిగామలో చదరపు గజానికి కనీస ధర రూ.12వేలు, కోకాపేట, నల్లగండ్లలో గరిష్ఠంగా రూ.65 వేలుగా నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో ప్లాట్ల విస్తీర్ణం 302 చదరపు గజాల నుంచి 8,591 చదరపు గజాల వరకు ఉన్నాయి. ఈ`వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్‌ఎండీఏ తెలిపింది. రిజిస్ట్రేషన్‌ కు చివరి తేదీ ఆగస్టు 16 కాగా, ఈ నెల 18 నుంచి ఈ`వేలం నిర్వహించనున్నారు. స్థలాల విక్రయంపై పూర్తి వివరాలను హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌ ష్ట్రబిబిజూబ://లిలిలి.ష్ట్రఎటజీ.ణనీల.తిని/జీబీఞబితినీనిబ/లో తెలుసుకోవచ్చు.

ఆ పార్టీల భూమి పట్టాలను రద్దు చేస్తాం.. 


బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండు పార్టీలకు ఇచ్చిన భూమి పట్టాలను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూములను అమ్మడం అంటే ప్రజలను మోసం చేయడమే అని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారన్నారు. ఈ భూముల వేలం అనేది ఒక దుర్మార్గపు చర్య. సంపద సృష్టించాల్సింది పోయి భూములు అమ్మి నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీని వల్ల వ్యవస్థ కూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని కోసమేనా కేసీఆర్‌ 80 వేల పుస్తకాలు చదివింది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పేదప్రజలకు ఇళ్లు కట్టడానికి స్థలం కనిపించదు కానీ..పెద్ద వ్యాపారులకు అమ్ముకునేందుకు మాత్రం స్థలాలు కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నించారు.ముందు తరాల వారికి చెందాల్సిన, ఉపయోగపడాల్సిన భూములను అమ్మడం అనేది సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. ప్రజల కోసం సైన్స్‌ సిటీని నిర్మించడానికి భూమి ఇవ్వమంటే ఇవ్వని కేసీఆర్‌ .. కాంగ్రెస్‌ కార్యాలయం కోసం మాత్రం 10 ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాజశేఖర్‌ రెడ్డి భూములు అమ్మితే కేటీఆర్‌ వ్యతిరేకించారని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం అధికారంలోకి రాగానే వీరే భూములు అమ్మడం మొదలు పెట్టారని విమర్శించారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు