Ticker

6/recent/ticker-posts

Ad Code

Telangana - BJP లో 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ఎక్కడ ?


హైదరాబాద్‌, ఆగస్టు 12, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో  పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. అన్ని పార్టీలు వారి వారి వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఢిల్లీ లో జరిగిన విూటింగ్‌ లో అమిత్‌ షా 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ డిసైడ్‌ చేయడం మిషన్‌ 75 టార్గెట్‌ గా పనిచేయాలని దిశ నిర్దేశం చేయడం జరిగింది కాని దాన్ని ఆచరణలోకి మాత్రం ఇంకా రాష్ట్ర నాయకత్వం తీస్కొని రాలేకపోతుంది. కొద్దిరోజులుగా యాక్టివిటీ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడమే అని శ్రేణులు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని కాషాయ పార్టీ నేతలే చెప్పుకోవడం గమనార్హం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కసారిగా పార్టీ స్తబ్దుగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అధ్యక్షుడి మార్పు నేతలందరికి షాక్‌ లో పడేసింది. పార్టీ అన్నాక మార్పులు చేర్పులు సహజమని భావించి ముందుకు వెళ్దామని అనుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ యాక్టివిటీ లేకపోవడంతో నేతలు డీలాపడ్డారు.బీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఇతర పార్టీల నేతలు నమ్మారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఎంతో మంది సీనియర్‌ నేతలు, మాజీ ఎంపీలు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. కానీ కేసీఆర్‌ కు చెక్‌ పెట్టేలా అనుకున్న స్థాయిలో ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఈ విషయంలో బీజేపీ వెనుకబడిరదని పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. బయటకు చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌ సర్కార్‌ ను ఇరుకున పెట్టే ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని లేవనెత్తడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలకు మాట్లాడేందుకు చాన్స్‌ ఇవ్వకపోవడం, ఇచ్చినా తక్కువ సమయం కేటాయిస్తున్నారని సదరు నేతలు చెబుతున్నారు. 


దీంతో కిందిస్థాయి నేతల్లో నిరాశ నెలకొంది.తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు వారి వారి గ్రౌండ్‌ ను స్ట్రాంగ్‌ చేసుకునే పనిలో పడ్డారు. బీజేపీలో బూత్‌ స్థాయి ఇన్‌ చార్జీల నియామకం, విస్తారక్‌, పాలక్‌ లను నియమించినా వారితో క్షేత్రస్థాయిలో పనిచేయించుకోవడంలో బీజేపీ వెనుకబడిరదని పలువురు పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్నా ఎలాంటి ముందడుగు పడకపోవడంతో నేతలు డైలమాలో పడ్డారు. ఇలా అయితే అధికారంలోకి వచ్చేదెలా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. యాక్టివ్‌ గా ప్రజల్లోకి ఇంకెప్పుడు వెళ్లేదని అంటున్నారు. పార్టీలో పవర్‌ ఫుల్‌ నేతలున్నా గ్రౌండ్‌ లో యాక్టివిటీ అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ప్రజల్లో పార్టీని తీసుకెళ్లేదెలా? అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని కేసీఆర్‌ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టి బీఆర్‌ఎస్‌ కు చెక్‌ పెడుతుందా? లేదా? అనేది చూడాల్సిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు