Ticker

6/recent/ticker-posts

Ad Code

Telangana లో- మద్యం దరఖాస్తుల ద్వారా 1400 కోట్ల ఆదాయం


హైదరాబాద్‌  ఆగస్టు 11 (ఇయ్యాల తెలంగాణ) : వైన్‌ షాపు టెండర్లకు అనూహ్య స్పందన లభిస్తోంది. వ్యాన్స్‌ లైసెన్సుల అనుమతులను పొందడానికి ఆశావాదులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 6913 దరఖాస్తులు వచ్చాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిరచారు. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే రూ. 1400 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. నిన్న(గురువారం) ఏకంగా 3140 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వైన్‌ షాపుల అనుమతుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వైన్‌ షాపులకు కొత్త లైసెన్సుల కోసం ప్రభుత్వం మూడు నెలల ముందుగానే టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 4 నుంచి సాయంత్రం 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 21న డ్రా పద్ధతిలో వైన్‌ షాపులను కేటాయిస్తారు.తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను సోమవారం (ఆగస్టు 8) 2000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఒక్కో దరఖాస్తుకు నాన్‌ రిఫండబుల్‌ ఫీజు కింద 2 లక్షలు చెల్లిస్తున్నారు. 2023`25 నాటికి తెలంగాణలో మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సులు ఇవ్వాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న వైన్‌ షాపుల లైసెన్సుల గడువు నవంబర్‌ 30తో ముగియనుండగా.. కొత్త లైసెన్సుల కోసం ఈ నెల 4 నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. 


జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా రాజకీయ నేతలు, వారి అనుచరులు దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాల్లో రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే 350 దరఖాస్తులు వచ్చాయంటే పోటీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 చివరి తేదీ. ఇప్పుడు ఇలా దరఖాస్తులు వెల్లువెత్తుతుంటే.. అప్పటికి ఇంకా ఎన్ని దరఖాస్తులు వస్తాయో..! 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన దరఖాస్తులన్నింటి నుంచి లాటరీ విధానంలో ఆగస్టు 21వ తేదీన మద్యం షాపుల లైసెన్స్‌లు కేటాయిస్తారు. గత నోటిఫికేషన్‌ లో నాన్‌ రిఫండబుల్‌ అప్లికేషన్‌ ఫీజు కింద రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈసారి అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు