రంగారెడ్డి ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ); శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తయింది. వెంటనే ) ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఫోన్ కాల్ ను ఆరా తీసారు. అంతలోనే ఎయిర్ పోర్ట్ అధికారులకు ఫోన్ చేసి సదరు ఫోన్ కాలర్ క్షమాపణ చెప్పాడు. పొరపాటున తమ పిల్లలు ఫోన్ తీసుకొని చేశారని ఆ వ్యక్తి భద్రతా సిబ్బందికి క్షమాపణలు కోరినట్లు సమాచారం. దాంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.