Ticker

6/recent/ticker-posts

Ad Code

SEPTEMBAR 9న జాతీయ LOK ADALAT

నందికొట్కూరు ఆగస్టు 19,ఇయ్యాల తెలంగాణ; సెప్టెంబర్‌ 9వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఇందిరా ప్రియదర్శిని జూనియర్‌ సివిల్‌ జడ్జి పవన్‌ కుమార్‌ తెలిపారు.జిల్లా కోర్టులోని నందికొట్కూరు జడ్జి ఛాంబరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. ఈ విషయాన్ని కక్షిదారులు గ్రహించి కేసులు రాజీ చేసుకోవాలని సూచించారు.జాతీయ లోక్‌ అదాలత్‌లో వీలైనంతవరకు రాజీ చేయదగ్గ కేసులను పరిష్కరించాలని సూచించారు. ప్రత్యేకించి క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు, మున్సిపల్‌ ప్రాపర్టీ టాక్స్‌, బిల్డింగ్‌ ప్లాన్స్‌ తదితర కేసులను రాజీపూర్వకంగాపరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు
జాతీయ లోక్‌అదాలత్‌కు సంబంధించి అందరికీ ముందస్తు సమాచారం అందించామన్నారు. లోక్‌అదాలత్‌ ఉద్దేశాన్ని కక్షిదారులకు విస్తృతస్థాయిలో వివరించామని అన్నారు. పలు ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాలు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు లోక్‌అదాలత్‌ విజయవంతానికి సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. నందికొట్కూరులో వాహన ప్రమాద కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, వాటి పరిష్కారానికి ముందుకు రావాలన్నారు.ప్రతి కక్షిదారుడు జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ పుల్లయ్య యాదవ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కిషోర్‌ న్యాయవాదులు సత్యనారాయణ వెంకట రాముడు పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు