మేడ్చల్ ఆగష్టు 5, (ఇయ్యాల తెలంగాణ ): ఆర్.టి.సి ఎంప్లాయిస్ ని ప్రభుత్వం లో విలీనం చేస్తూ రాష్ట్ర సియం కేసిఆర్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్ మోకారిల్లడాన్ని నిరసిస్తూ జీడిమెట్ల డిపోముందు ఆర్.టి.సి ఎంప్లాయిస్ 91బస్సు సర్వీస్ లను నిలిపివేస్తూ ధర్నాకు దిగారు..ఈ దర్నాకు అన్ని ఆర్.టి.సి యూనియన్ లు మద్దతు తెలుపుతున్నాయి..తెలంగాణ మజ్దూర్ యూనియన్,ఎంప్లాయిస్ యూనియన్,ఎస్.ఢబ్ల్యూ.ఎఫ్,టిజెఎమ్ తదితర యూనియన్స్ ఓకే తాటిపైకి వచ్చి ధర్నాను కొనసాగిస్తున్నాయి. ఆర్.టి.సి ఎంప్లాయిస్ ని కడుపులో పెట్టుకుని చూసే తెలంగాణ గవర్నమెంటు పంపిన గవర్నర్ అమోదం బిల్లుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న గవర్నర్ వెంటనే అమోదం బిల్లుపై సంతకం పెట్టి ఆర్.టి.సి ఎంప్లాయిస్ పట్ల విజ్ఞత చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జీడిమెట్ల డిపోముందు RTC కార్మికుల ధర్నా
శనివారం, ఆగస్టు 05, 2023
0
Tags