హైదరాబాద్, ఆగష్టు 06 (ఇయ్యాల తెలంగాణ) ఆర్టీసీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళ సై కొద్దిసేపటి క్రితం ఆమోదం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పనికి వచ్చేలాగా ఆర్టీసీ బిల్లు ఉండాలని సూచిస్తూ 10 రకాల సూచనలతో బిల్లుకు ఓకే తెలిపారు. తానూ ఎప్పటికైనా తెలంగాణ కార్మికుల పక్షమేనని తమిళ సై ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కానీ గత మూడు రోజులుగా తీవ్ర ఉత్కంఠ మధ్య ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్లు విషయంలో అనేక అనుమానాలకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా అనేక ఆశలతో ఎదురు చూస్తూ గవర్నర్ ఆమోదం కొరకు ఒక రోజు ఆర్టీసీ బస్సులను రెండుగంటల పాటు నిలిపి వేయడం జరిగింది. కానీ 10 రకాల రెకమండేషన్ తో రాష్ట్ర గవర్నర్ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లకు ఆమోదం ప్రకటించారు.