న్యూఢల్లీ, ఆగస్టు 27 (ఇయ్యాల తెలంగాణ ):పాత క్రిమినల్ చట్టాలను సవరిస్తూ .. కొత్త క్రిమినల్ చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇకపై కొత్త క్రిమినల్ చట్టాలనే అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై అవగాహన కల్పించడంతోపాటు.. పకడ్బందీగా అమలు చేయాలని పోలీసు అధికారులను హోం మంత్రి ఆదేశించారు. రెండు రోజుల పాటు పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్న కొత్త క్రిమినల్ చట్టాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలని సూచించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లు, 2023, భారతీయ నగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) బిల్లు 2023, భారతీయ సక్ష (బీఎస్) బిల్లు 2023 వరుసగా భారతీయ శిక్షాస్మృతి, 1860, క్రిమినల్ ప్రొసీజర్ చట్టం, 1898 మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో మూడు కొత్త కోడ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.పార్లమెంటులో కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదించినందున క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీని కోసం సిద్ధంగా ఉండాలని పోలీసు సూచించారు. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో ఢల్లీిలో రెండు రోజుల పాటు జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో అమిత్ షా శనివారం మాట్లాడారు. మూడు క్రిమినల్ కోడ్లు క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను పునరుద్ధరిస్తాయని, వ్యవస్థ భవిష్యత్తు డిమాండ్లను తీర్చడానికి సాంకేతిక ఆధారిత(ఏఐ) పోలీసింగ్ ను ప్రవేశపెట్టడానికి కొత్త చొరవలను సూచిస్తాయని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 750 మందికి పైగా పోలీసు అధికారులు భౌతికంగా.. వర్చువల్ పద్ధతుల్లో ఈ సదస్సులో పాల్గొన్నారు. పౌరులకు సకాలంలో న్యాయం అందించాల్సిన అవసరాన్ని, వారి రాజ్యాంగపరమైన హక్కులకు హావిూ ఇచ్చే వ్యవస్థను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. . దేశ అంతర్గత భద్రతా సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసులు తమ విధానంలో కొన్ని మార్చుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. పోలీసింగ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని నొక్కిచెప్పిన అమిత్ షా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో సాంకేతిక పురోగతిని ప్రస్తావించారు. ఏఐ ను ఒక అవకాశంగా ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. రాబోయే 25 ఏళ్లలో ఇతర దేశాలకు చెందిన వారు భారత్ నుంచి నేర్చుకునేలా ఇండియన్ పోలీసు వ్యవస్థ ఆదర్శంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
POLICE వ్యవస్థ మార్గదర్శనంగా ఉండాలి
ఆదివారం, ఆగస్టు 27, 2023
0
Tags