జగిత్యాల ఆగష్టు 18, ఇయ్యాల తెలంగాణ; జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు...వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణ ను జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ సందర్శించి సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణ ను పర్యవేక్షించారు. ఆనంతరం ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం తో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అదేవిధంగా ఏమైనా అల్లర్లు జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్
సంభవించినప్పుడు అల్లరి మూకలను చేదరగోటడనికి వజ్ర వెహికల్ ని ఉపయోగించే విధానాన్ని వజ్రా వెహికల్ ఉపయోగించి అల్లరి మూకలు చదరగొట్టడాన్ని కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో నేర్పించిన మెలకువులను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతిభద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలని అన్నారు. ఫైరింగ్ లోఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు.ఈ శిక్షణలో డీఎస్పీలు వెంకట స్వామి, రవీంద్ర రెడ్డి, రవింద్రకుమర్, రఘు చందర్,ఎస్భీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ రామక్రిష్ణ , వేణు సి.ఐలు ,ఎస్.ఐ లు రిజర్వు ఎస్సై లు , సివిల్, ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు