పెద్దపల్లి, ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని మాదిగలకే కేటాయించాలని మాదిగల మేధావుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్ ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మాదిగ మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సురేందర్, బిజెపి దళితమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం మాట్లాడుతూ, పార్లమెంటుగా అవతరించిన నాటి నుంచి పెద్దపల్లి స్థానాన్ని కేవలం ఒకసారి మాత్రమే మాదిగలకు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా పరంగా అధికంగా ఉన్న మాదిగలకు రాబోయే ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. అనంతరం భారత ప్రధాని నరేంద్రమోదీకి పోస్టు కార్డుల ద్వారా తమ అభిప్రాయాలని పంపిస్తామని తెలిపారు. పెద్దపల్లి స్థానాన్ని మాదిగలకు కేటాయించేవరకు ఏదో ఒకరూపంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. ఈనెల 20న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే సమావేషానికి మాదిగలు తరలిరావాలని పిలుపు నిచ్చారు.
మాదిగ అభ్యర్థిని ముఖ్య మంత్రిగా ప్రకటించాలని లేనిపక్షంలో ఉపముఖ్య మంత్రి, ఆర్థికమంత్రిత్వ శాఖలను మాదిగలకు కేటా యించాలని డిమాండి చేశారు. ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో 60శాతం సీట్లు ఇవ్వాలని, పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఇదే ఫార్ములా పెట్టినట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షులుగా మాదిగలకు కొన్ని స్థానాలు, రాష్ట్రస్థాయి బాద్యతలలో సముచిత స్థానం కల్పించాలని అన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యం గా, ఉద్యోగపరంగా, విద్యపరంగా నష్టపోయిన వారిని గుర్తించి ఆర్థిక ప్రయోజనాలు కలిపించా లని, ప్రభుత్వ పథకాల అమలులో మూడిరతలకు పెంచాలని, పరిశ్రమల ఏర్పాటుకు రూ.కోటికి తగ్గకుండా షరతులు లేని రుణాలు అందించాలని, రేషనుకార్డుతో సంబందం లేకుండా సంక్షేమ పథకాలు కల్పించడంతో పాటు 47డిమాండ్లను అంగీకరించిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని సురేందర్ స్పష్టం చేశారు. ఈ సమావేషంలో మామిడిపల్లి బాపయ్య, కాంపెల్లి ప్రభాకర్, సంకనపల్లి లక్ష్మయ్య, బండ కరుణాకర్, వడకాపురం ఆనంద్, అక్కపాక తిరుపతి, సురేందర్ సన్ని, తాండ్ర సదానందం, కుమ్మరి తిరుమల్, బచ్చల రాజన్న, పులిపాక మల్లేష్, కుక్క అశోక్, దాసరి సతిష్, తదితరులు పాల్గొన్నారు.