Ticker

6/recent/ticker-posts

Ad Code

OLD CITYలోCAR బీభత్సం

హైదరాబాద్‌, ఆగస్టు 14, ( ఇయ్యాల తెలంగాణ ): యువకుల అరాచకం.. కిలోవిూటరుపాటు సాగింది. కారు బీభత్సానికి పదిమంది గాయపడగా.. ఆరుగురికి తీవ్రగయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. యువకులను ఎలాగైనా పట్టుకునేందుకు స్థానికులంతా ఏకమయ్యారు. కారును వెంటాడి.. వెంబడిరచి పట్టుకున్నారు. అయినా కారును ఆపకుండా పోయేందుకు ప్రయత్నించారు యువకులు. పదుల సంఖ్యలో గుమిగూడిన స్థానికులు.. కారును కదలకుండా చేయడంతో ఎట్టకేలకు దిగొచ్చారు.హైదరాబాద్‌ పాతబస్తీ విూర్‌చౌక్‌ ఏరియాలో ఓ కారు బీభత్సం చేసింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు కన్నూమిన్నూ కానకుండా.. దారిలో కనిపించిన వాహనాలను ఢీకొట్టారు. యువకుల అరాచకం.. కిలోవిూటరుపాటు సాగింది. కారు బీభత్సానికి పదిమంది గాయపడగా.. ఆరుగురికి తీవ్రగయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

యువకులను ఎలాగైనా పట్టుకునేందుకు స్థానికులంతా ఏకమయ్యారు. కారును వెంటాడి.. వెంబడిరచి పట్టుకున్నారు. అయినా కారును ఆపకుండా పోయేందుకు ప్రయత్నించారు యువకులు. పదుల సంఖ్యలో గుమిగూడిన స్థానికులు.. కారును కదలకుండా చేయడంతో ఎట్టకేలకు దిగొచ్చారు. కారు నుంచి దిగి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించడంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. వారివెంట పరుగెత్తి యువకులను పట్టుకుని చితకబాదారు. కారును ఫల్టీలు కొట్టించి ధ్వంసం చేశారు. కారులో ఉన్న మద్యం సీసాలను పగులగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అటు ఓఎఓ నేతలు, ఇటు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నలుగరు యువకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు