కరీంనగర్ ఆగష్టు 10 (ఇయ్యాల తెలంగాణ ):జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కరీంనగర్‌నగరంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. కరీంనగర్ హుస్సేన్ పురాలో గురువారంతెల్లవారుజాము ఐదు గంటలనుంచి ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది. దుబాయి లో వుంటున్న స్థానికుడు తబ్రేజ్ ఖాన్ అనే వ్యక్తికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పీఎఫ్‌ఐ) అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు జరిపింది. దాదాపు నాలుగు గంటలపాటు తకిఖీలు జరిపిన ఎన్‌ఐయే బృందం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. తనిఖీలో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
0 కామెంట్‌లు