చార్మినార్, ఆగష్టు 19 (ఇయ్యాల తెలంగాణ) : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం పిలుపు మేరకు బండ్లగూడ మండల ఆఫీస్ లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులైన బడుగు బలహీన వర్గాల పేదలకు వెంటనే కేటాయించాలని కోరుతూ బీజేపీ భాగ్యనగర్ శాఖ నిరసన కార్యక్రమం చేపట్టింది.ఇందులో భాగంగా భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు జంగం మధుకర్ రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బండ్లగూడ తహసీల్దార్ జయమ్మకు వినితిపత్రం అందజేశారు. జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా నాయకులు మహేందర్ ప్రధాన కార్యదర్శి, జమాల్‌పూర్ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి, ప్రబాకర్ చంద్రాయన్ గుట్ట కన్వీనర్, ధీరజ్ లాల్ యాకుత్‌పురా కన్వీనర్, ప్రశాంత్ బహదూర్‌పురా కన్వీనర్, సీనియర్ లీడర్ సహదేవ్ యాదవ్, రూప్ రాజ్ ఉపాధ్యక్షులు, మహిళా మార్చా అధ్యక్షురాలు రాష్ట్ర అధికార ప్రతినిధి మోకాళ్ల వెంకటేష్ ఓబీసీ మోర్చా దశరధ లక్ష్మి, నాయకులు, భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కందడి ప్రేమ్ రాజ్ ఓబీసీ మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు