Ticker

6/recent/ticker-posts

Ad Code

సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య L`1

బెంగుళూరు ఆగష్టు 14 (ఇయ్యాల తెలంగాణ ):  చంద్రుడి అధ్యయనం కోసం చంద్రయాన్‌ ప్రాజెక్టును ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవలే చంద్రయాన్‌`3 స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా ప్రయోగించింది. ప్రస్తుతం ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి కక్ష్యలో ఉంది. ఇక ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ .. మరో చరిత్రకు శ్రీకారం చుడుతోంది. త్వరలో సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్‌`1(ంటతిబివజీ ఒ`1) మిషన్‌ను చేపట్టనున్నది. అయితే ఆదిత్య ఎల్‌`1 మిషన్‌కు చెందిన ఫోటోలను సోమవారం ఇస్రో అప్‌డేట్‌ చేసింది. బెంగుళూరులో తయారైన ఆ శాటిలైట్‌ ఇప్పుడు శ్రీహరికోటకు చేరుకున్నది. తొట్టతొటి సారి సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో సమాయాత్తమైంది. అయితే సెప్టెంబర్‌ మొదటి వారంలో ఆదిత్య ఎల్‌`1ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు