హైదరాబాద్, ఆగస్టు 26, (ఇయ్యాల తెలంగాణ ) ;టికెట్లు ఆశించే నేతల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇందులో భాగంగా పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత? రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ సీటు కోసం అప్లికేషన్ ఇచ్చారు. ఫలితంగా ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల్లో అధికారికంగా అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఏకంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. కట్ చేస్తే ఎన్నికల టైం దగ్గరపడుతున్న వేళ నేతల మధ్య టికెట్ వార్ ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఓ సీటు కోసం సీనియర్ నేత దరఖాస్తు చేసుకోవటం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ సీటు కోసం ఇద్దరు నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా? సీనియర్ నేత ఎంట్రీతో పరిస్థితేంటన్న చర్చ మొదలైంది.ఎల్బీ నగర్ నియోజకవర్గం?. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. 2014 నుంచి ఇక్కడి రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున ఆర్ కృష్ణయ్య గెలిచారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓటమిపాలయ్యారు. ఇక 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓడిపోయారు. అయితే కొద్దిరోజులకే సుధీర్ రెడ్డి కూడా కారెక్కారు. ఫలితంగా కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. నడిపించే నాయకుడే పార్టీ మారటంతో?. డైలామా పరిస్థితి నెలకొంది. సుధీర్ రెడ్డి పార్టీ మార్పు తర్వాత? ఇక్కడ మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్ రెడ్డి రాంరెడ్డి పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. ఇయనే కాకుండా? స్థానిక నేతగా పేరున్న స్థానిక నేతగా పేరున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ గా పని చేస్తున్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ తమదే అన్న ధీమాలో ఇద్దరు నేతలు కూడా ఉన్నారు. అయితే అనూహ్యంగా పార్టీకి చెందిన సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్?. ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వాలని గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు.మధుయాష్కీ గౌడ్ దరఖాస్తు ఫలితంగా ఎల్బీ నగర్ కాంగ్రెస్ టికెట్ వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కాంగ్రెస్ టికెట్ కోసం ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. నిజానికి గతంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు మధుయాష్కీ. అయితే ఇదే స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం కాస్త సైలెన్స్ గా ఉన్న మధుయాష్కీ? నిజామాబాద్ విషయంలో డైలామాలో పడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎల్బీ నగర్ టికెట్ బరిలోకి మధుయాష్కీ రాకతో కాంగ్రెస్ పార్టీ ఎవరివైపు నిలుస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.