హైదరాబాద్ ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ): ప్రజా ప్రతినిధులకు మంత్రి కే. తారకరామారావు పిలుపు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని ప్రజా ప్రతినిధులకు మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు అయన అందరకి లేఖ రాసారు.తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆలోచనల మేరకు అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ది కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించుకుందాం. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని అయన అన్నారు.చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఏ ప్రభుత్వము కేటాయించని విధంగా 2016`2017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ రూ. 1200 కోట్ల చొప్పున కేటాయిస్తువస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేనేత కార్మికుల సంక్షేమం , ఉపాది కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యల పాలవుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి చేనేతల రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. 2010 నుంచి వారికి ఉన్న లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయడంతో 10,148 చేనేత కార్మికులు రూ.28.97 కోట్ల ఋణాల నుండి విముక్తి అయ్యారని కేటీఆర్ పేర్కోన్నారు.
రాష్ట్ర ఏర్పడిన తర్వాత చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలను గుర్తిస్తూ, వారి మగ్గాలకు జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితుల పైన పూర్తి అవగాహనతో అనేక కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేత మిత్ర పథకం ద్వారా దాదాపు 50% రాయితీని వస్త్రాలు రసాయనాల కొనుగోలు పైన అందిస్తున్నాం. చేనేత మిత్ర పథకం ద్వారా ఇప్పటివరకు 22 వేల మంది నేతన్నలకు సూమరు 90 కోట్ల సబ్సిడీని నేరుగా వారి ఖాతాలలోనే అందుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారితో పంచుకోవాలని ఈ సందర్భంగా విూకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో భాగంగా విూ పరిధిలో ఉన్న నేతన్నలతో జాతీయ చేనేత దినోత్సవం సంబరాల్లో కలిసి పాల్గొని, వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూనాని అన్నారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం KTR
శనివారం, ఆగస్టు 05, 2023
0
Tags