Ticker

6/recent/ticker-posts

Ad Code

JNTU పరిధిలో కొత్త కాలేజీలు

హైదరాబాద్‌, ఆగస్టు 15, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో మరో రెండు జేఎన్‌టీయూ కాలేజీలు ఏర్పాటుకానున్నాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌లో జేఎన్‌టీయూ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది.బీటెక్‌లో మొత్తం అయిదు కోర్సులతో ఆయా ప్రాంతాల్లో జేఎన్‌టీయూ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ఆగస్టు 14న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కో కోర్సులో 60 సీట్లతో కాలేజీల ఏర్పాటుకు అవకాశం కల్పించింది.ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా కళాశాలల్లో.. సీఎస్‌ఈ, డేటా సైన్స్‌, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌ కోర్సులతో కొత్త జేఎన్‌టీయూ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే పాలేరు, మహబూబాబాద్‌ జేఎన్టీయూల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.తెలంగాణలో పీజీ డెంటల్‌ (ఎండీఎస్‌) కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో ప్రవేశాలకుగాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 8న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్‌`ఎండీఎస్‌`2023 అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ ఎండీఎస్‌ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 9న ఉదయం 8 గంటల నుంచి 16న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నీట్‌ పీజీ మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశాలకు కోరు అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో రెండు విడతల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 2తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి చివరివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా`డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాధారణంగా ఏటా ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు.నీట్‌ యూజీ`2023 రౌండ్‌ 2 సీట్‌ మ్యాట్రిక్స్‌ వివరాలను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ విడుదల చేసింది. మొదటి విడతలో సీట్లు పొందలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్న సీట్ల ఖాళీల వివరాలను చూసుకోవచ్చు. మొదటి విడత కౌన్సెలింగ్‌ తర్వాత అదనంగా 500 కొత్త సీట్లను రెండో రౌండ్‌లో కౌన్సెలింగ్‌కు జతచేశారు. రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగస్టు 14తో ముగియనుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయినవారు ఆగస్టు 15 వరకు ఆప్షన్ల నమోదు, లాకింగ్‌ ఉంటుంది. ఆగస్టు 16, 17 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, ఆగస్టు 18న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 19న పోర్టల్‌ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 28 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు