ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ):రాబోయే రోజుల్లో అంగారకుడితో పాటు శుక్రుడిపై కూడా పరిశోధనలు దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది. అయితే ఇందుకు మరింత పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. స్పేస్ సెక్టార్లో విస్తరించి.. భారత్‌ను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే చంద్రుడికి సంబంధించి రోవర్ పంపే మరిన్ని చిత్రాల కోసం ఇస్రో బృందం ఆసక్తితో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం చందమామపై శాస్త్రీయ అధ్యయనం, పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెడుతున్నామన్నామని తెలిపారు. అంతరిక్షంలో విస్తరించి దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లడమే ఇస్రో లక్ష్యమని పేర్కొన్నారు. ఇస్రో ప్రధానమంత్రి దార్శనికతను అమలు చేయగలుగుతోంది. స్పేస్ సెక్టార్లో విస్తరించి.. భారత్‌ను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. అలాగే చంద్రుడికి సంబంధించి రోవర్ పంపే మరిన్ని చిత్రాల కోసం ఇస్రో బృందం ఆసక్తితో
ఎదురుచూస్తోందన్నారు. ప్రస్తుతం చందమామపై శాస్త్రీయ అధ్యయనం, పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెడుతున్నామన్నామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఆదిత్య ఎల్`1 మిషన్‌పై కూడా ఆయన స్పందించారు. దీన్ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఈ ఆదిత్య ఎల్`1 లాంచ్‌కు సంబంధించి చివరి తేదీని ఒకటి, రెండు రోజుల్లోనే ప్రకటించనున్నామని చెప్పారు. ఆదిత్య ఎల్`1 మిషన్‌ను నింగిలోకి పంపిన తర్వాత.. లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుకునేందుకు దాదాపు 125 రోజుల వరకు పడుతుందని సోమ్‌నాథ్ తెలిపారు. మరో వైపు ప్రగ్యాన్ రోవర్ మామూలోడు కాదు.. సెకన్‌కు సెంటీవిూటర్ మాత్రమే నడుస్తున్నాడు.. బుజ్జిగాడు చాలా కంటెంట్ ఉన్నోడు.. ఆరు చక్రాలతో చంద్రుడి శిఖరంపై ఠీవిగా నిలబడి దిక్కులు చూస్తూ.. ఫోటోలు తీస్తూ.. రకరకాల అన్వేషణలు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నాడు. అంతేనా ఇప్పటికే ఇస్రో అప్పగించిన రెండు కీలక పనులను కంప్లీట్ చేసి.. నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాడట.. మూడోలక్ష్యాన్ని కూడా ఇన్‌టైమ్‌లో చేయాలని.. ముమ్మరంగా పని చేస్తున్నాడు. సెకన్ కూడా గ్యాప్ లేకుండా.. రెస్ట్ తీసుకోకుండా.. అలుపు సొలుపు తెలియకుండా.. ఎవ్వెరీ సెకండ్ దమ్మున్న చిన్నోడు జాబిలిపై దుమ్ము రేపుతున్నాడంట.. ముఖ్యంగా శివశక్తి పాయింట్ దగ్గరే రోవర్ రఫ్ఫాడిస్తున్నాడట..రోవర్ మూన్‌వాక్ ను ఇస్రో ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది.. చంద్రుడి తలపై రోవర్ చక్రాల గుర్తులు గుండెలు ఉప్పొంగేలా చేస్తున్నాయి. అంతేనా..జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన రోవర్.. చెప్పిన పని చెప్పినట్లు చేస్తోందట.. జాబిల్లిపై భారత సంతకం చేస్తూ పరుగులు పెడుతోంది. పరిశోధనల్లో భాగంగా ప్రగ్యాన్ రోవర్ తీసే ఫోటోలు, వీడియోలను ఇస్రో ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది.. ఎంతో సమాచారం ఉంటోందని కూడా చెబుతోంది.. ల్యాండర్ లెగ్ ర్యాంప్ విూదుగా జారుకుంటూ కిందికి దిగింది. కొంతదూరం ప్రయాణించిన తరువాత తనను తాను ఎడమవైపునకు టర్న్ తీసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మూడు లక్షలా 84 వేల కిలోవిూటర్లు ప్రయాణించి కూడా.. ఇంత యాక్టివ్‌గా పని చేస్తూ..ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది ఈ చిట్టి ప్రగ్యాన్ రోవర్.. ఇంకా కొద్దిరోజులు ఇదే పనివిూద బిజీగా ఉండే రోవర్ ప్రతిభా పాటవాలు అనంతం..తాజాగా రోవర్‌కు సంబంధించిన మరో కొత్త వీడియోను ట్విటర్లో షేర్ చేసింది ఇస్రో. ఇందులో ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాబిల్లి ఉపరితలంపై రోవర్ చక్కర్లు కొడుతోంది. ల్యాండర్ లెగ్ ర్యాంప్ విూదుగా జారుకుంటూ కిందికి దిగింది. కొంతదూరం పాటు ప్రయాణించిన తరువాత తనను తాను ఎడమవైపునకు టర్న్ తీసుకోవడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ చక్రాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘‘చంద్రుడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రజ్ఞాన్ రోవర్.. శివశక్తి పాయింట్ వద్ద చక్కర్లు కొడుతోంది’’ అని ఇస్రో రాసుకొచ్చింది.భారత కాలమానం ప్రకారం ఆగస్ట్ 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3 లో భాగమైన విక్రం ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగింది. ఆ తరువాత, ల్యాండిరగ్ సమయంలో రేగిన దుమ్ము, దూళి సెటిల్ అయిన తరువాత, దాదాపు మూడు గంటల అనంతరం, భారత కాలమానం ప్రకారం రాత్రి 9.04 గంటలకు రోవర్ సైడ్ ప్యానెల్ నుంచి ఒక ర్యాంప్ చంద్రుడి విూదకు జారింది.దానిపైనుంచి ప్రజ్ఞాన్ రోవర్ నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టింది. ఆ తరువాత తనలోని పేలోడ్స్ అన్నింటిని సిద్ధం చేసుకున్న ప్రజ్ఞాన్ రోవర్.. క్రమంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్ గా ప్రధాని మోదీ నామకరణం చేసిన విషయం తెలిసిందే.శివ శక్తి పాయింట్ వద్ద ప్రజ్ఞాన్ రోవర్ దాదాపు 8 విూటర్ల దూరం నెమ్మదిగా ప్రయాణం సాగించింది. మార్గ మధ్యంలో చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ప్రయాణం సాగించింది. ఈ వీడియోను ఇస్రో ట్విటర్ లో షేర్ చేసింది. ‘‘చంద్రుడి దక్షిణ ధ్రువంలో దాగిన రహస్యాలను అన్వేషిస్తూ శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్’’ అనే కామెంట్ ను కూడా జత చేసింది.చంద్రయాన్ 3 కి సంబంధించిన మూడు లక్ష్యాలలో ఇప్పటివరకు రెండు లక్ష్యాలు నెరవేరాయని ఇస్రో ప్రకటించింది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ కావడమనే తొలి లక్ష్యం కాగా, చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ సురక్షితంగా దిగి, ఆ నేలపై తిరగాలన్నది రెండో లక్ష్యం అని వివరించింది. చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని, ప్రకంపనాలను, కెమికల్ కాంపొజిషన్ ను శాస్త్రీయంగా విశ్లేషించ డమనే మూడో లక్ష్యం దిశగా ప్రజ్ఞాన్ రోవర్ సాగుతోందని వివరించింది.