హైదరాబాద్, ఆగష్టు 19 (ఇయ్యాల తెలంగాణ) : 77వ స్వాత్రంత్ర దినోత్సవం సందర్బంగా '' ఇంటింటా ఇన్నోవేటర్ '' పోటీ ధ్వారా ఎంపికై 4 ఆవిష్కర్తలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రశంసించారు. సృజనాత్మాకతను ప్రోత్సహించడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటా '' ఇంటింటా ఇన్నోవేటర్ '' పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఉదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆవిష్కరణలను ప్రోత్స్తహించేందుకు ఆన్లైన్ లో '' ఇంటింటా ఇన్నోవేటర్ '' పోటీ ఏర్పాటు నిర్వహించడం జరిగింది.
ఇందులో గృహిణి నుండి పాఠశాలలు, కళ్లాశాల స్థాయి విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యవసాయదా రులు ఇలా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు.
హైదరాబాద్ జిల్లా నుండి 4 ఆవిష్కర్తలు న్యాయనిరనేతలు ధ్వారా విజేతలుగా ఎంపిక చేయబడింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా సైన్స్ అధికారి సి. ధర్మేందర్ రావ్ , ఈడి ఎం. రజిత ఇంటింటా ఇన్నోవేటర్ పోటీలో విజేతలు 4 ఆవిష్కర్తలను తన కలెక్టర్ ఆఫీస్ లో ప్రశంసించారు.
విజేతలు వారి ఆవిష్కరణలు :--
( 1 ) నితిన్ రాజేష్ --- మినీ పోర్టబుల్ సోలార్ పంప్
(2 ) గౌతమ్ -- టెక్ రెడ్
(3) డాక్టర్ పీ ఝాన్సీ లక్ష్మి -- క్రాప్ ప్రొటెక్ట్ ఆంబిరెళ్ల
( 4 ) రఘునందన్ -- వరల్డ్ చీపేస్ట్ మినీ లైబ్రరీ.
0 కామెంట్‌లు