ఆగష్టు 30 (ఇయ్యాల తెలంగాణ )చంద్రయాన్ 3 మిషన్ ద్వారా భారతదేశం సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబోతోంది. చంద్రుడు పై అడుగుపెట్టిన అనంతరం ఇస్రోబ్యోమనవక అందించే వివరాలు ఎంతో విలువైనవని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు ముఖ్యంగా భవిష్యత్తు ఇంధన అవసరాలకు ఉపయోగపడే హీలియం 3 వంటి వనరులు చంద్రుడు పై పుష్కలంగా ఉండే అవకాశం ఉందని తద్వారా. మన దేశం ఇంధన రంగంలో అగ్రగామిగా ఎదిగే అవకాశం సైతం ఉందని డి ఆర్ డి ఓ కు చెందిన మాజీ చీఫ్ కంట్రోలర్ ఆర్అండ్ డీ, ఏఎస్ పిళ్లై అభిప్రాయపడ్డారు.భూమి అయస్కాంత క్షేత్రం ద్వారా రక్షింపబడుతున్నట్లుగా, చంద్రుడికి హీలియం రక్షణగా ఉంది. సూర్యుడి నుంచి వెలువడే గాలుల ద్వార హీలియం ఐసోటోపులు చంద్రుడిపై అపారంగా ఉన్నాయి. దీనిని అణురియాక్టర్లలో వాడటం ద్వారా రేడియో ధార్మికతను నిరోధించవచ్చు. భూమిపై హీలియం చాలా తక్కువగా ఉంటుంది. చంద్రయాన్`3ని శాస్త్రవేత్తలు పంపడానికి ముఖ్య కారణం ఇదే. హీలియాన్ని మైనింగ్ చేయడం ద్వారా అత్యధిక లాభాలను ఆర్జించవచ్చు. చంద్రుడిపై కొన్ని విూటర్ల లోతువరకు దాదాపు 25 మెట్రిక్ టన్నుల హీలియం ఐసోటోపులు 1.1 మిలియన్ మెట్రిక్ టన్నుల హీలియం`3 ఉన్నాయని, స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ద్వారా కార్గొలో దానిని భూమిపైకి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తద్వారా ఎనర్జీ సంక్షోభాన్ని, పర్యావరణ పరిరక్షణను ఎదుర్కొవచ్చని అంచనా. 100 కేజీల హీలియం 140 మిలియన్ డాలర్ల ఖరీదు చేస్తుంది. దీనితో 1000 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయవచ్చు. హీలియం`3 గ్యాస్ ను నూక్లియర్ ఫ్యూషన్ ( రెండు అణువులను కలిపే ప్రక్రియ)ప్లాంట్లలో ఉపయోగించుకోవచ్చు. విషపూరితం కాని, రంగు, రుచి, వాసనలేని, దేనితోనూ సంయోగం చెందనిది హీలియం గ్యాస్ . చంద్రుడిపై చంద్రయాన్ `3 కీలక విషయాలు బయటపెట్టింది. రోవర్ లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎల్ ఐబీఎస్) చంద్రుడి దక్షిణ ద్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, తోపాటు, ఆక్సిజన్ ను కనుగొన్నామని, హైడ్రోజన్ కోసం పరిశోధన జరుగుతోందని కనుగొన్నట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ విజయం భారతదేశ రోదసి చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించే అవకాశం ఉందని పేర్కొన్నారు అలాగే చంద్రయాన్ 3 మిషన్ ద్వారా భారతదేశం అమెరికా రష్యా చైనా సరసన చేరుతుందని పేర్కొన్నారు ఇప్పటివరకు కేవలం మూడు దేశాలు మాత్రమే చంద్రుడు పై తమ ప్రయోగాలను విజయవంతంగా సఫలీకృతం చేసుకున్నాయి. అయితే ఈ సందర్భంగా పిల్లై కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు అందులో ప్రధానమైనది భవిష్యత్తు ఇంధన అవసరాలకు ఉపయోగపడే హీలియం 3 గురించి ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. హీలియం 3 అనేది నాన్ రేడియో యాక్టివ్ ఐసోటోప్, ఇది ఒక జడ వాయువు ఇందులో ఒక న్యూట్రాన్ రెండు ప్రోటాన్లు ఒక న్యూక్లియస్ ఉంటాయి. భూవ్మిూద ఇలాంటి మూలకం కనుగొనడం చాలా కష్టం. కానీ కొద్ది మొత్తంలో సహజవాయువులో హీలియం 3 ట్రేసెస్ రూపంలో దొరుకుతుంది కానీ పెద్ద మొత్తంలో లభించదు. అదే చంద్రుడిపై అయితే హీలియం 3 పెద్ద మొత్తంలో లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు. అణు ఇంధనాన్ని నియంత్రించే ఈ ఐసోటోప్ వల్ల భవిష్యత్తులో అను విద్యుత్ ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొంటున్నారు. చంద్రుడి ఉపరితలంపై హీలియం 3 పుష్కలంగా లభించే అవకాశం ఉందని ఇందుకు కారణం చెబుతూ చంద్రుడి ఉపరితలంపై వాతావరణం లేకపోవడంతో సూర్యకాంతి నేరుగా చంద్రుని తాకుతుందని అందుకే అక్కడ హీలియం 3 విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు. చంద్రయాన్ మిషన్లో ఇది ఒక ప్రధాన భాగం అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ హీలియం ` 3 మూలకం పెద్ద మొత్తంలో లభిస్తే అది భారత్ ఇంధన అవసరాలను తీర్చడంలో చాలా ఉపయోగపడుతుందని పిల్లని పేర్కొన్నారు. మార్కెట్ లోకి చంద్రయాన్ రాఖీలు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ `3 విజయవంతం కావడంతో రాఖీలు కూడా చంద్రయాన్ `3 వచ్చాయి. ల్యాండర్, రోవర్ ఆకారాల్లో రాఖీలు అందుబాటులో ఉన్నాయి.
చంద్రుడిపై భారీగా HELIUM నిల్వలు
బుధవారం, ఆగస్టు 30, 2023
0
Tags