Ticker

6/recent/ticker-posts

Ad Code

దళితుల అభ్యున్నతికి ప్రణాళిక బద్ధంగా Government చర్యలు : మంత్రి కొప్పుల


పెద్దపల్లి , ఆగష్టు 11 (ఇయ్యాల తెలంగాణ) : దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మార్కెట్‌ యార్డులో ఎస్సీ యూనిట్లను జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంకు లింకేజీ తో సంబంధం లేకుండా చిరు వ్యాపారాలు చేసుకునేందుకు దళితులకు రూ. 50 వేల యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. బ్యాంగిల్‌ షాపులు, పూజ సామాగ్రి దుకాణం, పూల దుకాణం, టీ షాప్‌ వంటి చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయం చేసిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ దళితుల కోసం ఉన్న గురుకుల పాఠశాలలను, మహిళ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారని వివరించారు.విదేశాలలో చదివే దళిత యువత కోసం అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. 

దళితులు అధికంగా నివసించే ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా వంటి అనేక మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు స్వయం ఉపాధి కింద దళితులకు కేవలం 20 శాతం మాత్రమే సబ్సిడీ అందించేవని వెల్లడిరచారు. సీఎం కేసీఆర్‌ దళితుల కోసం వంద శాతం సబ్సిడీతో బ్యాంకు లింకేజీ లేకుండా 10 లక్షలు సహాయం అందించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.ఈ పథకం ద్వారా దళితులు ఆర్థిక పురోగతి సాధిస్తున్నారని, సిరిసిల్ల జిల్లాలో 5 గురు దళితులు కలిసి రైస్‌ మిల్‌ ఏర్పాటు చేశారని అన్నారు. దళిత బంధు(పథకం ద్వారా సంపద సృష్టి జరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. రెండవ విడత దళిత బంధు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని మంత్రి అన్నారు.ఎస్సీ కార్పొరేషన్‌ కింద రూ. 50 వేల యూనిట్లు అందుకున్న వారికి సైతం భవిష్యత్తులో దళిత బంధు అమలు అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు