హైదరాబాద్ ఆగష్టు 18, ఇయ్యాల తెలంగాణ ; జి.హెచ్.ఎం.సి పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ లిబర్టీ లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ముట్టడికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లొయిస్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు భారీగా మోహరించారుర. కార్యాలయ లోపలికి రాకుండా బారీగేట్లు వేసారు. ముట్టడికి వస్తున్న కార్మికులు, ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేసారు. తక్షణమే జిహెచ్‌ఎంసి ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అందోళనకారులు డిమాండ్ చేసారు.
0 కామెంట్‌లు