Ticker

6/recent/ticker-posts

Ad Code

DECEMBER మొదటి వారంలో ఎన్నికలు..?

హైదరాబాద్‌, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. అక్టోబర్‌ రెండో వారం తర్వాత షెడ్యూల్‌ రిలీజ్‌ అవుతుందని, డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో పోలింగ్‌ ఉంటుంది తెలుస్తున్నది. ఈ మేరకు ఎన్నికల పక్రియకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర అధికారులకు సూచించినట్టు సమాచారం. ఎలక్షన్‌ పక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి స్టేట్‌ ఆఫీసర్లకు రోడ్‌ మ్యాప్‌ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. షెడ్యూలు,



పోలింగ్‌ అంశాలపై క్లారిటీ వచ్చిందని చెప్పుకొచ్చాయి. అందులో భాగంగానే త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించేందుకు సీఈఓ ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌. ఈ వారం చివర్లో సెంట్రల్‌ ఎలక్షన్‌ టీం రాష్ట్రంలో పర్యటించే చాన్స్‌ ఉన్నది.2018లో తెలంగాణతో పాటు మిజోరం, రాజస్తాన్‌, చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఒకేసారి షెడ్యూలు విడుదల చేసింది. ఈ సారి సైతం అదే తేదీన ఎలక్షన్స్‌ నిర్వహించే అవకాశమున్నట్టు టాక్‌. ‘2018లో డిసెంబరు 7న తెలంగాణ అసెంబ్లీకి ఓటింగ్‌ జరిగింది.

 ఈసారి కూడా డిసెంబర్‌ 7న ఎలాంటి పండుగలు లేకపోతే అదే రోజు పోలింగ్‌ ఉండొచ్చు. లేకపోతే రెండు రోజులు అటు ఇటుగా డేట్‌ ఫిక్స్‌ కావచ్చు.’ అని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వెల్లడిరచారు. మిజోరంలో డిసెంబరు 16 లోపు అసెంబ్లీ ఎన్నిక పూర్తవ్వాలి. అదే టైంలో మన రాష్ట్రానికి సైతం ఎన్నికల పక్రియ పూర్తవుతుందని వివరించారు.ఈ నెల 6వ తేదీ తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లో విూటింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్‌. ఈ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసర్ల టీమ్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

 ఆ తర్వాత సెంట్రల్‌ ఈసీ బృందాలు రాష్ట్రంలో పర్యటించి, ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని ఎథికల్‌ ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఈసీ.. ఆల్‌ పార్టీ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు, వాటి అమలుకు సుమారు 70 రోజులు మాత్రమే గడువు ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎలక్షన్‌ షెడ్యూలు వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్‌ మేరకు ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే చాన్స్‌ ఉండదు. అందుకే సీఎం కేసీఆర్‌ పాత హావిూల అమలుపై ప్రస్తుతం ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే రుణమాఫీని సెప్టెంబర్‌ రెండోవారం లోపు పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు