తాడేపల్లిగూడెం ఆగష్టు 30 (ఇయ్యాల తెలంగాణ ):రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ బుధవారం రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ కు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కొట్టు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో అన్నా , చెల్లెలు, అక్కా,తమ్ముళ్లు మధ్య అనుబంధాన్ని చాటేది రక్షాబంధన్ అన్నారు. ప్రతి ఒక్కరు ఒకరికొకరు రక్షణగా ఉంటూ సోదర సౌబ్రాతృత్వాన్ని చాటాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి అక్క, చెల్లెమ్మకు ఒక అన్నగా, తమ్ముడిగా, తల్లికి కొడుకుగా రక్షణగా అండగా ఉంటున్నారు అన్నారు. ఈ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి కార్యకలాపాల గురించి వారు మంత్రి కొట్టుకు వివరించారు. అనంతరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు , వైకాపా యువ నాయకులు కొట్టు విశాల్ తదితరులకు బ్రహ్మకుమారిస్ రాఖీలు కట్టి రక్షాబంధన్ ను చాటారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రం నిర్వాహకులు రమాదేవి, దీప, కుమారి, సాహిత్య, సత్యనారాయణ లు పాల్గొన్నారు.
డిప్యూటీ CMకొట్టుకు బ్రహ్మకుమారీస్ రక్షాబంధన్
బుధవారం, ఆగస్టు 30, 2023
0