Ticker

6/recent/ticker-posts

Ad Code

CLICK...CLICK....నేడు ప్రపంచ PHOTOGRAPHY దినోత్సవం


హైదరాబాద్ ఆగష్టు 19, ఇయ్యాల తెలంగాణ ;ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవజీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. ఫొటోగ్రఫీకి శతాబ్ధాల చరిత్ర ఉంది. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం ఆగస్టు 19 న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. లూయిస్‌ డాగ్యురే అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్‌లను ఏకం చేయడానికి మరింత మందిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19 న ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ అనేది గ్రీకు పదం నుండి వచ్చింది. ఫొటో అంటే కాంతి, గ్రాఫి అంటే తీసుకోవడంం. ప్రపంచ ఫోటో దినోత్సవం, దీనిని 19 ఆగష్టు 1910న మొదటగా జరుపుకున్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవం డాగ్యురో అనే శాస్త్రవేత్త ఆవిష్కరణల నుండి ఉద్భవించింది. ఫ్రెంచ్‌దేశానికి చెందిన లూయిస్‌ డాగ్యురే, జోసెఫ్‌ నైస్‌ఫోర్‌ నీప్ప్‌ అభివృద్ధి చేసిన ఫోటోగ్రఫీ ప్రక్రియల గురించి 1839 జనవరి 9న ఫెంచ్‌ కాడవిూ ఆఫ్‌ సైన్సెస్‌ డాగ్యూరే టైప్‌ ప్రాసెస్‌ను అధికారికంగా ప్రకటించింది. తర్వాత కొద్దినెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పెటెంట్‌ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ఏటా ఆగస్టు 19ని ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుతున్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రఫిక్‌ కౌన్సిల్‌ 1991 నుంచి దేశంలో ప్రతియేటా ఆగస్టు 19న ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపడం ప్రారంభించింది.

మనదేశంలో 1840లోనే ఫోటోగ్రఫీ కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. మొట్ట మొదటిగా కలకత్తాలో కేలోటైపు మొదటి ఫొటోగ్రఫీ స్టూడియో స్థాపించారు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. ఇప్పటికి 8 చౌరంగీరోడ్డు కల కత్తాలో నిల్చి ఉన్నది.1854లో ఫొటో గ్రాఫిక్‌ సొసైటీ ఆఫ్‌ బాంబే స్థాపించబడిరది. మనదేశంలో ఇది మొట్టమొదటి ఫొటోక్లబ్బు. ఆ తర్వాత ఇది ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్‌ ఇండియాగా మార్పు చెందింది. అప్పట్లో కేవలం బ్రిటీష్‌రాజు, జమిందారులకు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. 1877 నుంచి ఫొటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. జేఎన్‌టీయూలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వెంకటేశ్వర ఫైనార్ట్స్‌ కళాశాల, లకోటియా ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫొటోగ్రఫీలో శిక్షణనిస్తున్నారు. వీటిలోనే కాకుండా పలు ప్రైవేట్‌ శిక్షణ కేంద్రాల్లో కూడా ఫొటోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నారు. ఫొటోగ్రఫీ నాలుగేళ్ల కోర్సులో ఎనిమిది సెమిస్టర్లుంటాయి. 30 సీట్లను ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.ఫ్యాషన్‌, పారిశ్రామిక, పర్యాటక, ట్రావెల్‌, జర్నల్‌లకు సంబంధించి ఫొటోగ్రఫీ, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో కూడా శిక్షణ ఉంటుంది.ఫొటోగ్రఫీలో ఒకప్పుడు పురుషులు మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ రంగంపై మక్కువ కనబరుస్తున్నారు.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు