హైదరాబాద్, ఆగస్టు 17, (ఇయ్యాల తెలంగాణ) : నిత్యం రద్దీతో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ఫ్లై ఓవర్ల నిర్మాణాలతో ట్రాఫిక్ కష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ూఖీఆఖ కింద నగరంలో సిగ్నల్ ఫ్రీ సిటీ లక్ష్యంగా చేపట్టిన 32 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రాగా.. నగర కిర్తీకిరిటంలో మరో కలికితురాయి లాంటి స్పెషల్ ఫ్లై ఓవర్ రెడీ అయింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద 30 వేల కోట్ల రూపాయలతో పలు పై వంతెనలు, అండర్ పాస్ లు నిర్మించింది. ఇప్పటివరకు 32 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా.. 33వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నగరవాసులకు అందుబాటులోకి వస్తోందిలోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోవిూటర్ల దూరంలో 5 జంక్షన్లతో ఎవరైన ఆర్టీసీ క్రాస్ రోడ్డు దాటి విద్యానగర్ వైపు వెళ్లాలంటే అరగంట టైం పడుతుంది. ఆ దూరాన్ని మరింత చేరువచేసేలా జంక్షన్లు జామ్ కాకుండా వాటిపై నుంచి దక్షిణ భారతంలోనే అతిపొడవైన 2.6 కిలోవిూటర్ల స్టీల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. నిత్యం రద్దీ ఉండే ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, మూవీ థియోటర్ల జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్, బస్ భవన్, వీఎస్టీ వరకు ఈ స్టీల్ వంతెనతో ట్రాఫిక్ సమస్య తీరనుందిఇరుకైన ఈ రోడ్డుమార్గంలో కాంక్రీట్ ఫ్లై ఓవర్ కంటే స్టీల్ బ్రిడ్జి నిర్మాణం మేలని ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. 2020 జులై 10న శంకుస్థాపన జరిగినా 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్లలో పూర్తౌెన స్టీల్ బ్రిడ్జి 4 లైన్ల రోడ్ తో ఏర్పాటు చేశారు. 450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 12,500 మెట్రిక్ టన్నుల ఇనుముతో దీన్ని నిర్మించారు. సన్నటి ఐరన్ పిల్లరు 81 ఉంటే 426 దూలాలు నిర్మించినట్లు ఇంజనీర్లు తెలిపారు. నగరంలో మరో మైలురాయిగా నిలిచే ప్లై ఓవర్ తమ నియోజకవర్గంలో రావడంపై స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ యువజన నాయకులు ముఠా జైసింహా సంతోషం వ్యక్తం చేశారు.ఈ మార్గంలో రోజూ లక్ష వాహనాలు నడుస్తూ ఉంటాయి. సాధారణంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ విూద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. వాహనాల డెన్సిటీ ఎక్కువ ఉండటంతో పాటు జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ టెన్షన్ షరామాములే ఇక్కడ. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో 2.6 కిలోవిూటర్ల దూరమైన లోయర్ ట్యాంక్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు. అంటే అరగంట జర్నీలో 25 నిమిషాల సమయం ఆదా అవుతుంది. దీనిపై వాహనాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో పలు చోట్ల ఫ్లై ఓవర్ల పై నుంచి మెట్రో లైన్ ఉంది. కానీ ఇక్కడ మెట్రో రైలు పై నుంచి ఈ బ్రిడ్జి నిర్మించారు. మెట్రో లైన్ పై నుంచి వెళుతున్న తొలి ఫ్లైఓవర్ గా ఈ వంతెన ప్రత్యేకత దక్కించుకుంది. కాంక్రీట్ ఫ్లైఓవర్లతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ఖర్చు ఎక్కువై తక్కువ టైంలో పూర్తి చేయొచ్చు. 2020 జులై 10న ఈ ఫ్లైఓర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రెండున్నర ఏళ్లలో 4 లైన్ల రోడ్‌తో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. రూ.450 కోట్ల అంచనా వ్యయం కాగా 12,500 మెట్రిక్ టన్నుల ఇనుమును ఉపయోగించారు. సన్నటి ఐరన్ పిల్లర్లు 81, 426 దూలాలు నిర్మించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ విూద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో 2.6 కిలోవిూటర్ల దూరమైన లోయర్ ట్యాంక్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు.నగరంలో పలు చోట్ల ఫ్లై ఓవర్ల పై నుంచి మెట్రో లైన్ ఉంటుంది. కానీ ఇక్కడ మెట్రో లైన్ పైనుంచి వెళ్లేలా ఈ బ్రిడ్జి నిర్మించారు. సిటీలో మెట్రో లైన్‌పై నుంచి వెళ్తున్న తొలి ఫ్లైఓవర్ గా ఈ వంతెన ప్రత్యేకత దక్కించుకుంది. కాంక్రీట్ ఫ్లైఓవర్లతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ఖర్చు ఎక్కువై, కానీ తక్కువ టైంలో నిర్మాణాలను పూర్తి చేయొచ్చు.
వందేళ్లకు పైగా మన్నిక ఉంటుందట. ఆగస్టు 19న ఈ ఇందిరా పార్క్ టూ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ చేతులవిూదుగా ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగరంలో మరో మైలురాయిగా నిలిచే ప్లై ఓవర్ తమ నియోజకవర్గంలో రావడంపై స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.అలాగే మన్నిక కూడా దాదాపు వందేళ్ల పై మాటే అంటున్నారు ఇంజనీర్లు. ఆగస్టు 19 న ఈ ఇందిరా పార్క్ టూ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ చేతులవిూదుగా ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
0 కామెంట్‌లు