చార్మినార్, ఆగష్టు 12 (ఇయ్యాల తెలంగాణ) : పేద వారు కంటున్న స్వంత ఇంటి కలను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ తెరాస పార్టీ అమాయక ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుందని బీజేపీ పార్టీ చార్మినార్ నియోజక వర్గం నాయకులు ప్రవీణ్ బాగ్ది అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న డబల్ బెడ్ రూమ్ ధర్నాలో పాల్గొని చార్మినార్ నియోజక వర్గంలో స్వంత ఇల్లు లేని నిరుపేదల వివరాలను, వారి దరఖాస్తు ఫారాలను ప్రవీణ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతికి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ కార్యాలయాల ద్వారా కాకుండా కెసిఆర్ స్వంత పథకాలుగా వాడుకోవడం స్వార్థ రాజకీయాలకు ఊతం పోస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో చార్మినార్ నియోజక వర్గంలో పేదలకు డబల్ బెడ్ రూమ్ అందేలా చూస్తామన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గారికి డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు ఫారాలను చార్మినార్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి అందజేయడం జరిగింది.
0 కామెంట్‌లు