Ticker

6/recent/ticker-posts

Ad Code

Charminar నియోజక వర్గంలో జండా ఆవిష్కరించిన BJP నేత Kumar

 


చార్మినార్, ఆగష్టు 15 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ నియోజక వర్గం పరిధిలోని సుల్తాన్ షాహీ , గంగ పుత్ర సంఘం, బిర్డ్జ్ తదితర ప్రాంతాల్లో గోల్కొండ బీజేపీ ఉపాధ్యక్షులు ఎం. కుమార్ జాతీయ జండా ను ఎగుర వేశారు. ఈ సందర్బంగా కుమార్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా నినాదంతో దేశంలో కీర్తి ప్రతిష్టలు మోడీ మరింత పెంచారని అన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పల్లెల లక్ష్మణ్, కరంజయ,సునీల్ తివారీ,బి. దేవానంద్, ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ అధ్యక్షులు దయానంద్,రాజ్ గోపాల్, అశ్విని , సురేష్, వినోద్,గంగ పుత్ర సంఘం యువజన సంఘం అధ్యక్షులు చిన్న బాబు, సత్యపాల్, మహేష్, కిశోర్, శ్రీను, రమేష్, సాయి,నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.   



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు