కర్నూలు ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ): మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్ కార్యముందు ధర్నా నిర్వహించారు ముందుగా శ్రీనివాస్ సర్కిల్ ప్రాంతంలో గల అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించి బీమాస్ సర్కిల్ విూదుగా ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ ఆదోని పట్టణ కార్యదర్శి వెంకన్న అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజయ్ బాబు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని నమ్మబలికి మోసం చేశారన్నారు మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదని తెలిపారు ఔట్సోర్సింగ్ కార్మికులకు ధరల కనుగుణంగా 26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు కరోనా విపత్తులో పనిచేసిన కార్మికుల సేవలను గుర్తించి పర్మినెంట్ చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకన్న అధ్యక్షులు భీమేష్ ఉప ప్రధాన కార్యదర్శి ప్రకాష్ సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు సుదర్శన్ కల్లుబావి రాజు లక్ష్మీనారాయణ షేక్షావలి సోమన్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జాన్ బాబు జయరాజు షేకన్న శాంతప్ప మహేష్ నాగరాజ్ నాగమ్మ సుశీలమ్మ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
C M మాట నిలుపుకోవాలి
మంగళవారం, ఆగస్టు 29, 2023
0
Tags