Ticker

6/recent/ticker-posts

Ad Code

BRS, MIM, CONGRESS ల D N A ఒకటే

యాదాద్రి ఆగష్టు 18, ఇయ్యాల తెలంగాణ;యాదాద్రి భువనగిరి జిల్లా  నకిరేకల్‌ లో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. కిషన్‌ రెడ్డి మాట్లడుతూ తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. రైతుల్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. గ్రామకంఠం భూములతోసహా దళితులకు ఇచ్చిన భూముల్ని బీఆర్‌ఎస్‌ నేతలు ఆక్రమించారు. లిక్కర్‌ షాపుల్ని ఆరు నెలల ముందే వేలం వేస్తున్నారు. ప్రతీ గ్రామంలోని బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది.  కేసీఆర్‌  కుటుంబ పాలనను తరిమికొట్టి.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.రైతు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ పంపిణీ బీజేపీ పోరాట ఫలితమే. కేంద్రంలో మోదీ సారధ్యంలో బీజేపీ హ్యాట్రిక్‌ సాధిస్తుంది.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఢల్లీిలో కీలకపాత్ర పోషిస్తామని కేసీఆర్‌ కలలు కంటున్నారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ డీఎన్‌ఏ ఒకటే. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. మజ్లిస్‌ పార్టీ వారి పంచెన చేరి దోపిడి చేస్తోందని ఆరోపించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు