పెద్దపల్లి ఆగష్టు 10 (ఇయ్యాల తెలంగాణ ):`మత్స్యశాఖ చైర్మన్ నర్సయ్య ముదిరాజు
ముదిరాజుల సమస్యల కోసం జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని, ఆ సందర్భంగా ఎన్ని సమస్యలు ఎదురైనా మొదటి దెబ్బ తనవిూదే పడుతుందని పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ చైర్మన్ కొలిపాక నర్సయ్య ముదిరాజు అన్నారు. నందన గార్డెన్ లో ముదిరాజ్ సంఘం ఆద్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కొలిపాక శ్రీనివాస్ తో కలిసి మాట్లాడుతూ, ముదిరాజులను ఇప్పటి వరకు అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకు గానే పరిగణించాయని, ఇకపై అలాంటి పార్టీల ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ అభ్యర్థి గెలుపు ముదిరాజుల ఓట్లతోనే ముడిపడి ఉందని, జాతి మొత్తం ఒక్కటై రాజకీయాలని శాసించాలని పిలుపునిచ్చా రు. జనాభా నిష్పత్తి ప్రకారం అధికంగా ఉన్న ముదిరాజుల పట్ల పదవుల పంపకాల్లో అన్యా యం చేస్తున్న పార్టీల భరతం పడుతామని హెచ్చరించారు. రాజకీయాల్లో ఎదుగుతున్న ఈటెల రాజేందరుపై జరిగిన కక్ష్యసాధింపు చర్యలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బిడ్డకు అలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాద్యత ముదిరాజులపై ఉందని పేర్కొన్నారు. అనంతరం కొలిపాక నర్సయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో నాయకులు రేండ్ల మల్లికార్జున్, కొలిపాక నర్సయ్య, గుండా లక్ష్మన్, సదయ్య, ముత్యాల రాజయ్య, సంపత్, తీగల సదయ్య, కొలిపాక చిరంజీవి, సిరవేన స్వప్న, లక్ష్మినర్సయ్య, నక్క రమేష్, కలవేన రాజేషం, చుంచు సదయ్య, కలవేన సంపత్ ముదిరాజ్, మల్లికార్జున్, లక్ష్మీరాజ్యం, చంద్యయ్య, అనకట్ల స్వామి, అభిలాష్, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు