Ticker

6/recent/ticker-posts

Ad Code

గోదావరి ఎక్స్ప్రెస్‌ రైల్లో ఎలుక కలకలం

హైదరాబాద్‌ ఆగష్టు 14 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్‌ లో ఎలుక కలకలం రేపింది.  రైలు థర్డ్‌ ఏసీ కోచ్‌  క్యాబిన్‌ కంట్రోల్‌ పానెల్‌ లోకి ఎలుక దూరడంతో పొగలు వచ్చాయి. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్‌ నెలకొంది. ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఖమ్మం విజయవాడ మధ్యలో బోనకల్‌ స్టేషన్‌ దగ్గర ఈ ఘటన జరిగింది.దాంతో ఒక్క సారిగా రైలు నిలిపేశారు.సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్‌ నెలకొంది.సిబ్బంది  ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. పొగలు రావడంతో ప్రయాణికులు భయపడి బయటకు వెళ్లేందుకు ఎగబడ్డారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు