పెద్దపల్లి ఆగష్టు 8, (ఇయ్యాల తెలంగాణ ): తొమ్మిదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో అర్హులైన నిరుపేదలకు కేటాయించిన రెండు పడకల గదుల ఇల్లు ఇప్పటికి ఇంకా వారి దరికి చేరలేదు... కళ్ళకు దగ్గరగా కనిపిస్తున్న కాళ్లకు మాత్రం దూరంగానే ఉంది. ఇప్పటికీ రెండుసార్లు అర్హులని ఎంపిక చేసినా పంపిణీ విషయంలో మాత్రం స్తబ్దత కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించి న దశాబ్ది ఉత్సవాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కొద్దిమంది లబ్దిదారులకు ఇచ్చినట్టే ఇచ్చి పత్రాల ను తీసుకున్నదని, ఎందుకంటే నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయని ఇంకా కొన్ని మరమ్మత్తు లు జరుగుతున్న దృష్ట్యా అందరికీ ఒకేసారి పత్రాలను ఇచ్చి గృహప్రవేశం చేయిస్తారానే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిపారు. అర్హులని మరీ లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి నెంబర్లు కూడా కేటాయించారు. ఇప్పటికీ మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. జూన్ 24న పలువురు లబ్ధిదారులు కొత్తగా వచ్చిన కలెక్టర్ కు ప్రజావాణి లో వినతిపత్రం అందజేశారు. మళ్లీ రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కలిసి లబ్ధిదారులు విన్నవించుకున్నారు. అయితే ఇళ్ల నిర్మాణాలల్లో కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నా యని వాటిని త్వరలోనే అందజేస్తామని హావిూ ఇచ్చినట్లు తెలిపారన్నారు. బిజెపి పార్టీ లబ్దిదారు లతో కలిసి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. అయితే లబ్ధిదారులు ఎమ్మెల్యేని కలిసి 15 రోజులు దాటిన ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు భారీ ఎత్తున సోమవారం మరోసారి కలెక్టర్ కార్యాల యం ముందు ధర్నా నిర్వహించి, ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతుండటంతో లబ్ధిదారుల్లో భయం పట్టుకున్నది. ప్రతిపక్షాల నాయకులను కలవడమే మార్గంగా ఎంచుకున్నట్టుగా వారు పేర్కొంటున్నా రు.ఫస్ట్ స్టేజ్ లో 1100 మందిని, రెండో స్టేజ్ లో 550 మందిని, మూడో స్టేజ్ లో 484 మందిని అధికారులు సెలక్ట్ చేశారు. మరి వీళ్ళయినా వుంటారో పోతారో, ఇంకా అర్హులైన వారిని కొంత మందిని ఎంపిక చేసేదిగా ఉందని అధికారు లు పేర్కొంటున్నారు. మరి ఆ కోవలో లబ్ధిదారు లకు పంపిణీ చేయడం ఆపి వేశారా లేక మిగతా అర్హులను కూడా ఎంపిక చేసి అందరికి ఒకేసారి పంపిణి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు గృహప్రవేశం చేసే యోగం దక్కుతుందో లేదోననే భయాందోళనలో ఉన్నారు. కొన్ని జిల్లాలో పంపిణీ చేసిన కూడా, ఇక్కడ మాత్రం వారి బాధలు ఎవరు పట్టించుకునే వారు లేకుండా పోయారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ పూర్తికాకముందే గృహలక్ష్మి అంటూ ప్రభుత్వం కొత్త పథకం తీసుకు వచ్చింది. ఒకవేళ డబుల్ బెడ్ ఇల్లు రాకపోయినా గృహలక్ష్మి దరఖాస్తు చేసుకుందా మంటే సెలక్షన్ లో వచ్చిన వారి పరిస్థితి అగమ్య గోచరంగ మారింది. కాగా అధికారులు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణాల సర్వేలో చాలామంది అనర్హులని ఎంపిక చేశారని పలువు రు ఆరోపిస్తు న్నారు. ఏది ఏమైనా డబల్ బెడ్ రూమ్ లు అర్హులైన లబ్ధిదారులకు చేరేవరకు అర చేతిలో వైకుంఠమే అవుతుందేమో వేచి చూడాలి మరి....
అర్హులకు డబుల్ బెడ్ రూమ్ దక్కేనా
మంగళవారం, ఆగస్టు 08, 2023
0
Tags