Ticker

6/recent/ticker-posts

Ad Code

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

పార్వతీపురం మన్యం ఆగష్టు 14 (ఇయ్యాల తెలంగాణ ):పార్వతీపురం కేంద్రంలో స్వాంతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై  జాతీయ జెండా ఎగురవేయాలని జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.  నా నేల ` నా దేశం కార్యక్రమంలో భాగంగా  సోమవారం ఉదయం  సెయింట్‌ పీటర్స్‌ పాఠశాల ఆవరణ నుండి  ప్రారంభమైన బైక్‌ ర్యాలీ ని జిల్లా కలెక్టరు  ప్రారంభించారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ  నా నేల ? నా దేశం  కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను నిర్వహించడం జరిగిందని, కార్యక్రమంలో భాగంగా  ప్రతిచోట శిలాఫలకాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని, ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి  సందేశాన్నిప్రజలకు అందించి గ్రామంలో దేశరక్షణలో ప్రాణాలర్పించిన మరియు సేవలందిస్తున్న సైనికులకు సన్మానించడంజరిగిందని తెలిపారు.   మరియు ఈ సంవత్సరం ఈ దేశం మనకేమిచ్చింది,  మాతృదేశానికి మనం ఏమి చేయాలనే నినాదంతో  ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలోను 75 మొక్కలు నాటాలని తెలిపారు.   దేశానికి  జాతీయ జెండాను  రూపకల్పన చేసిన  పింగళి వెంకయ్య ఆంధ్రుడేనని తెలిపారు.   దేశభక్తి విషయంలో ఆంధ్రుల ప్రత్యేకత వేరని సాధారణంగా స్వాతంత్య్రసమయయోదులు, జాతీయనాయకుల పేర్లు రోడ్లు, పార్కులు, కూడళ్లకు పెడతారని కాని ఆంధ్రప్రదేశ్‌  తమ పిల్లలకు జాతీయ నాయకులు పేర్లు పెట్టుకొనుట ప్రత్యేకమని అది  వారి దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు.  రేపు నిర్వహిస్తున్న  స్వాతంత్య్రదినోత్సవవేడుకలలో ప్రజలందరూ పాల్గొనవలసినదిగా కోరారు. శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ  స్వాతంత్య్రదినోత్సవరం సంధర్బంగా నా నేల ` నా దేశం  కార్యక్రమంలో గ్రామగ్రామాన జాతీయజెండాను ఎగురవేసి, దేశభక్తిని చాటుకున్నామన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు