ఈ నెలలోనే మొదటి జాబితా? మరోవైపు.. శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేసీ.వేణుగోపాల్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి గాంధీభవన్‌కు చేరుకుని సునీల్ టీమ్ అందజేసిన రిపోర్టుపై మేధోమథనం చేశారు. ఇదిలా ఉంటే ఈనెలలోనే మొదటి జాబితాలో కొన్ని అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే బీఆర్ఎస్లో కూడా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సీఎం కేసీఆర్ కూడా అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది.
Telangana లో కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఇవే...PCC చేతిలో కీలక రిపోర్టు!
శనివారం, ఆగస్టు 05, 2023
0
హైదరాబాద్ ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహరచన మొదలుపెట్టాయి. కదనరంగంలో నేతలంతా పూర్తిగా క్రియాశీలకమయ్యారు. ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల కోసం వేటను కొనసాగిస్తున్నాయి. ఎక్కడెక్కడ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో లెక్కలుకడుతున్నాయి. ఇందుకోసం సర్వేలు చేయించుకుంటున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా తెలంగాణను హస్తగతం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల వేట మొదలుపెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ సర్వే చేపట్టి కీలక రిపోర్టును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌కి అందజేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఈ టీమ్ నివేదికను రూపొందించింది.రిపోర్ట్‌లో ఏముందంటే..119 సీట్లను 3 భాగాలుగా సునీల్ విభజన:ం. కేటగిరీలో 41 స్థానాలు,ః. కేటగిరీలో 42 స్థానాలు,అ. కేటగిరీలో 36 స్థానాలు.ఏ కేటగిరీలోని స్థానాలను కాంగ్రెస్ పార్టీ గన్‌షాట్‌గా గెలుచుకుంటుందని సునీల్ కనుగోలు టీమ్ అంచనావేసింది. ఇక బీ కేటగిరీలో కొంచెం కష్టపడితే గెలిచే స్థానాలుగా పేర్కొంది. సీ కేటగిరీ సీట్లలో బలహీనంగా ఉందని పేర్కొన్నారు. బీ కేటగిరీ స్థానాల్లో గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని రిపోర్ట్‌లో సూచించారు. బీ కేటగిరీ సీట్లలో బలం పెంచుకునేందుకు పార్టీ నేతలకు సునీల్ టీమ్ దిశానిర్దేశనం చేసింది.
Tags