విజయవాడ, ఆగస్టు 8, (ఇయ్యాల తెలంగాణ ): డబుల్ సెంచరీ దిశగా పరిగెడుతున్న టమోటో ధరలకు బ్రేక్ పడిరది.. గత పది రోజులుగా భారీగా పెరుగుతూ రైతు మార్కెట్లోనే 150 రూపాయలకు చేరిన టమోటో ధరలు కాస్త ఇప్పుడూ ఏకంగా 70 రూపాయలు తగ్గాయి. అంటే సగానికి సగం ధర తగ్గినట్లే.. ఇక వచ్చే వారం రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గనున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. రైతు మార్కెట్లలోనే నిన్నటి వరకు కేజీ 150 ఉంటే ఇక రిటైల్ మార్కెట్ లో ఖ్వాలిటీ బట్టి 200 కు పైనే అమ్మేసుకున్నారు...కొన్ని రోజులైతే చాల చోట్లో టమోటోలు అసలు కనుమరుగైపోయాయి...సబ్సిడీ టమోటాలు కోసం జనాలు..డబుల్ సెంచరీ దిశగా పరిగెడుతున్న టమోటో ధరలకు బ్రేక్ పడిరది.. గత పది రోజులుగా భారీగా పెరుగుతూ రైతు మార్కెట్లోనే 150 రూపాయలకు చేరిన టమోటో ధరలు కాస్త ఇప్పుడూ ఏకంగా 70 రూపాయలు తగ్గాయి.
అంటే సగానికి సగం ధర తగ్గినట్లే.. ఇక వచ్చే వారం రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గనున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. 60 ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో టమోటో ధరలు ఈసారి సామాన్యులని అల్లాడిరచాయి. మహా ఉంటే పది రూపాయలు, అదీ దాటితే 25, అంతకు మించి పైకి వెళ్లని టమోటో ధరలు ఈసారి ఆకాశాన్ని తాకాయి.తెలుగు రాష్ట్రాల్లోనే పలు చోట్లు ఏకంగా డబుల్ సెంచరీ క్రాస్ చేశాయంటే సాధారణ విషయం కాదు? రైతు మార్కెట్లలోనే నిన్నటి వరకు కేజీ 150 రూపాయల ధర ఉంటే ఇక రిటైల్ మార్కెట్లో క్వాలిటీ బట్టి 200 రూపాయల కంటే పైనే అమ్మేసుకున్నారు కూరగాయల వ్యాపారులు. కొన్ని రోజులైతే చాలా చోట్లో టమోటాలు అసలు కనుమరుగైపోయాయి. సబ్సిడీ టమోటాలు కోసం జనాలు రైతు మార్కెట్లలో ఎలా క్యూ కట్టారో ప్రత్యేకంగా చప్పాల్సిన అవసరం లేదు.ఇక ఒకొనొక స్టేజ్‌లో ప్రభుత్వం కూడా భారీగా పెరిగిన టమోటా ధరలకు వారం పాటు ఇవ్వకుండా హాండ్స్ అప్ అంది? ఇక వ్యాపారాలు కూడా టమోటా భారాన్ని మోయ్యలేక బాయ్‌కట్ కూడా చేసారు.. అలాంటి టమోటో ధర ఇప్పుడు కొండ దిగిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తుంది?గత నెల రోజులకు పైగా టమోటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్పా ఎక్కడ తగ్గలేదు తగ్గినా మహా అయితే ఐదు రూపాయలు తగ్గి మళ్ళి 10 రూపాయలు పెరిగాయి. అలాంటిది ఇప్పడు ఏకంగా కేజీ టమోటోపై రైతు మార్కెట్ లోనే 70 రూపాయలు తగ్గి ప్రస్తుతం కేజీ టమోటో 80 రూపాయలుగా ఉంది. అంటే సగానికి సగం తగ్గినట్లే. ఇక రిటైల్ గా కూడా టమోటో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.నిన్నటి వరకు మార్కెట్ యార్డ్స్ ల 4300 పలికిన 23 కేజీల టమోటో బాక్సు ధరలు ఆదివారం నాటికీ అత్యధికంగా 2300కి చేరటమే ఈ ధరల తగ్గుదలకు కారణం? ఇక నాణ్యతను బట్టి బాక్సు 1500 రూపాయల నుండి 2300 వరకు పలికింది. దాంతో టమోటో ధరలు నాణ్యతను బట్టి కిలో 65 రూపాయల నుంచి 100 రూపాయలకు చేరుకున్నాయి?మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి కాస్త మెరుగవ్వటంతో ఇక్కడ నుండి ఎగుమతి చేసే టమాటా లోడ్ కూడా తగ్గిందని?రాబోయే రోజుల్లో రెగ్యులర్ సబ్సిడీ ధరకు మార్కెట్ లో టమోటోలు వచ్చేస్తాయి భావిస్తున్నాయి మార్కెట్ వర్గాలు. మరి మళ్ళీ తగ్గుతాయో పెరుగుతాయో తెలియాలంటే మరికొన్ని వేచి చూడాల్సిందే.