హైదరాబాద్, ఆగస్టు 27 (ఇయ్యాల తెలంగాణ ):: ఓవైసి, కేసీఆర్ అన్న దమ్ములు.. ఎంఐఎం పార్టీ ముస్లిం వారికి ఏం చేసింది? అని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర గార్డెన్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఓవైసి పోటు గాడు చార్మినార్ కే పరిమితమన్నారు. దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. అధికార పార్టీ దగ్గర ఎంఐఎం డబ్బులు తీసుకోవడం అలవాటు అని అన్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్రంలో అధికారం రావడానికి ఇతర రాష్ట్రాల నుండి ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటిస్తున్నారని అన్నారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేసిందని అన్నారు. బెంగాల్ లాగా బీఅర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ సగం మందికి టికెట్స్ రావని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వాళ్ళకే టికెట్స్ ఇచ్చారని ఎద్దేవ చేశారు. 30 శాతం కమిషన్ అంటే కేసీఆర్ కుటుంబం, అవినీతి కుటుంబం అని బండి తెలిపారు. మళ్ళీ ఎన్నికలు రాగానే అమలు కాని హావిూలు ఇస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం ఎలా కోటీశ్వరులు అయ్యారు? ఏం బిజినెస్ చేశారు? అంటూ ప్రశ్నించారు.వైన్స్ షాప్ దంధాలు చేయడానికి, కేసీఆర్ కుటుంబం, అధికారులు ప్లీజ్ టెండర్ వేయండి అంటూ మార్కెటింగ్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ 3 సక్సస్ అయింది..అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం అక్కడ ఎలాంటి దందా చేయవచ్చు, అని ఆలోచన చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దందా నెక్స్ట్ చంద్ర మండలం పై చేస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తుండు కేసీఆర్ అని మండిపడ్డారు. గవర్నర్ కి భయపడే సీఎం సయోధ్యకి వచ్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్లులు ఆమోదం కోసమే గవర్నర్ తో సీఎం సయోధ్యకు వచ్చారని బండి ఆరోపించారు. నేను సీఎం కావాలని అనుకోవటం లేదు, అనుకునే వాళ్ళు మూర్ఖులు అని అన్నారు. ముందు రాక్షన ప్రభుత్వంను తొక్కాలని అన్నారు. బండి సంజయ్ ఎక్కడి నుండి పోటీ చేసేది అనేది అధిష్టానం చూసుకుంటుంది అని అన్నారు. సర్వేలు ఆధారంగా టికెట్ ఇస్తారు.. బీజేపీలో లాబియింగ్ ఉండదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారని బండి సంజయ్ తెలిపారు.
ముస్లింలకు ఓవైసీ చేసిందేమిటీ
ఆదివారం, ఆగస్టు 27, 2023
0
Tags