హైదరాబాద్ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ ):మాదన్నపేట్ మార్కెట్ లో ఓ ముఠా దొంగ సొసైటీలు సృష్టించి అక్రమ పార్కింగ్ కు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం పై గతంలో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. కానీ అక్రమ దారులు నిరంతరం కొత్త వ్యహాలతో కోర్టును, పోలీసులను, జీహెచ్ఎంసిఞ వ్యవస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. ఓ తరుణంలో జీహెచ్ఎంసి అధికారులు కోర్టు ద్వారా అక్రమ పార్కింగ్ పేపర్లు సరి కావని నిరూపించి మూసివేశారు. మళ్ళీ ఈ అక్రమ పార్కింగ్ దళారులు వసూళ్లు పాల్పడటంతో పోలీసులకు పట్టించారు. కానీ 10 నిముషాల్లో పోలీసులు వదిలేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మార్కెట్ ఎవరి పేరు విూద ఉన్నది...ఏ దొంగ సొసైటీ అక్రమాలకు పాల్పడుతుంది?...అసలు నగరంలో పార్కింగ్ వ్యవస్థ ఉన్నదా...ఉంటే ఏ డాక్యుమెంట్లతో అనుమతులు పొందాలి...నియమనిబంధనలు ఉండాలి చూడాల్సిన బాధ్యత పోలీసులకు , జీహెచ్ఎంసికి ఉన్నది..కానీ ఎన్ని వ్యవస్థలు ఉన్న ఫలితం ఏమిటి...అక్రమాదారులకు పంట పండుతుంది...ఇకనైనా పోలీసులు, జీహెచ్ఎంసి స్పందించి చట్టపరంగా వ్యవస్థలకు న్యాయం చేసి అక్రమాదారులను అరికట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతులను, వ్యాపారస్తులను బెదిరిస్తున్న ఓ ముఠా
100కు పిర్యాదు చేసి అక్రమపార్కింగ్ దారులను పట్టించారు..
కానీ కొద్దీ సేపటికే వదిలేయడంతో మళ్ళీ వసూళ్లు
దొంగ సొసైటీ సృష్టించి పోలీసులను, కోర్టులను, జీహెచ్ఎంసి వ్యవస్థలను మోసం చేస్తున్న అక్రమపార్కింగ్ దారులు
మాదన్నపేట్ పోలీసు స్టేషన్లో ఘటన