మూడు భారీ బహిరంగసభలకు కాంగ్రెస్ ప్లాన్
మంగళవారం, ఆగస్టు 08, 2023
0
హైదరాబాద్, ఆగస్టు 8, (ఇయ్యాల తెలంగాణ );:తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తోంది. అధికార బీఆర్ఎస్ ఎత్తుగడలకు ధీటుగా కార్యాచరణను రూపొందించే పనిలో పడిరది. ఇందులో భాగంగా.... శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లోని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది.నల్లగొండ, మహబూబ్‌నగర్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో భారీ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభలకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రప్పించనుంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15వ తేదీలోపే ఈ సభలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఎన్నికలు సవిూపిస్తున్న వేళ నేతలందర్నీ సమన్వయం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. నేతల మధ్య విభేదాలను పక్కనపెట్టి పని చేయాలని పదే పదే చెబుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే సభలను నిర్వహించి... కేడర్ లోకి కూడా స్పష్టమైన సందేశాన్ని పంపాలని చూస్తోంది. గతంలో చేపట్టిన నిరుద్యోగ బహిరంగ సభలకు మంచి స్పందన వచ్చింది. నల్గొండలో నిర్వహించిన ర్యాలీలో జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా ఏకతాటిపైకి వచ్చి కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. గాంధీ భవన్ లో జరిగిన భేటీలో ఏఐసిసి ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే , టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి , రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు దీప దాస్ మూన్షి , ఏఐసిసి కార్యదర్శులు శ్రీధర్ బాబు , రోహిత్ చౌదరి , విశ్వనాథ్ , మన్సూర్ అలీ ఖాన్ , వంశీ చంద్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సంపత్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ , ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహతో పాటు పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పార్లమెంట్ పరిశీలకులు ఈ భేటీలో భాగమయ్యారు.
Tags