కొవ్వూరు ఆగష్టు 5, (ఇయ్యాల తెలంగాణ ): ఏజెంట్ చేతిలో మోసపో యి మస్కట్ లో చిక్కుకుపోయిన ఒక యువతి హోంమంత్రి తానేటి వనిత చొరవతో తన స్వగ్రామం చేరుకున్నా రు. దీంతో హోంమంత్రి క్యాంపు కార్యా లయంలో మంత్రిని కలిసి ఆ కుటుంబ మంతా కృతజ్ఞతలు తెలిపింది. ఇటీ వల తూర్పు గోదావరి జిల్లా నిడదవో లు మండలం తిమ్మరాజు పాలెంకు చెందిన గెడ్డం ప్రభ ఉపాధి వెతుక్కుం టూ మస్కట్ కు వెళ్లిందని,తన కూతు రుకి అక్కడ ఎదురైన పరిస్థితిని తల్లి కొండేపూడి సత్యవతి వివరించడంతో హోంమంత్రి చలించిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక, అర్ధాకలితో జీవించలేక తిరిగి స్వదేశం వచ్చేందుకు ఆదుకునే హస్తం కోసం ఎదురు చూస్తున్న సమ యంలో హోంమంత్రి చొరవ తీసుకుని బాధితురాలిని స్వగ్రామానికి తీసుకు రావడంతో ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడు తూ.. దళారులు, మధ్యవర్తుల మాట లు నమ్మి మోసపోవద్దని సూచించారు. మోసం చేసిన ఏజెంట్ పై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభు త్వం అండగా ఉంటుందని హోంమంత్రి తానేటి వనిత భరోసా ఇచ్చారు.