పెద్దపెల్లి ఆగష్టు 18,ఇయ్యాల తెలంగాణ; మావోయిస్టు కీలక నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న కన్నుమూసినట్లు సమాచారం.వృధాప్య నేపధ్యంలో అయన అనారోగ్య కారణాలతో ఆయన మరణించారు. అయితే, రాజారెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయన మృతదేహం చుట్టు పార్టీ నేతలు కుర్చుని వున్న వీడియో మాత్రం విడుదలయింది.మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి గ్రామం. అయన కొద్దిరోజుల క్రితం వరకు ఛత్తీస్గఢ్, ఒడిశా దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్, సాయన్న, విూసాల సాయన్న, అలోక్, అలియాస్ దేశ్పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.
0 కామెంట్‌లు