ఏలూరు, ఆగస్టు 10, (ఇయ్యాల తెలంగాణ ); ప్రభుత్వ కృషి ఫలితంగా రొయ్యల కౌంట్ ధరలు పెంచేందుకు ప్రాసెసింగ్ కంపెనీలు ముందుకొచ్చాయి. గత నెలాఖరులో జరిగిన ఆక్వా సాధికారత కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రకటించిన ధరలను మరోసారి పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. 20 నుంచి 55 కౌంట్ వరకు కేజీకి రూ.10 చొప్పున, 56 నుంచి 100 కౌంట్ వరకు కేజీకి రూ.5 చొప్పున ధర పెంచుతున్నట్టు ప్రకటించాయి. దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా.. తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిపై ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆక్వా రైతులు ఏ దశలోనూ నష్టపోకూడదన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రుల సారథ్యంలో సమావేశమైన రైతు సాధికారత కమిటీ రొయ్యల ధరలను పెంచేందుకు కృషి చేస్తోంది. ఆక్వా రైతుల సమక్షంలో ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతిదారులతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు జరుపుతున్న చర్చలు మంచి ఫలితమిస్తున్నాయి. గత నెలాఖరులో ప్రకటించిన ధరలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగగా, మంగళవారం మరోసారి పునఃసవిూక్షించి.. కేజీకి రూ.5 నుంచి రూ.10 చొప్పున పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ నెల 9వ తేదీ నుంచి రానున్న పది రోజుల పాటు కొత్త ధరలు అమలులో ఉంటాయిప్రభుత్వం నిర్దేశించిన ధరల చెల్లింపులో ఏజెంట్లు, షెడ్ల నిర్వాహకులు కోత పెడుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో ఎగుమతిదారులతో పాటు షెడ్ల యజమానులు, ఏజెంట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకనుండి రైతుల నుంచి కొనుగోలు చేసే వారెవరైనా కచ్చితమైన బిల్లులు ఇచ్చి కొనుగోలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. లేకుంటే అప్సడా చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.దేశంలో ఒక్క ఏపీలో మాత్రమే కౌంట్‌ల వారీగా ధరలను ప్రకటిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పూర్వం నుంచి కొనసాగుతున్నట్టుగా ప్రతి 10 కౌంట్లకు ఒక ధర చొప్పున నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకటించిన కౌంట్ ధరలు పొరుగు రాష్ట్రాలతో కంటే మెరుగ్గా ఉన్నాయి. తమిళనాడు, ఒడిశా, గుజరాత్, పశి?చమ బెంగాల్, మహరాష్ట్రలో ప్రధాన కౌంట్లకు మన కంటే కేజీకి రూ.5 నుంచి రూ.25 వరకు తక్కువగానే చెల్లిస్తున్నారు.
0 కామెంట్‌లు