Ticker

6/recent/ticker-posts

Ad Code

కొత్త మద్యం షాపులకు లైసెన్సులు

 
హైదరాబాద్‌, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ );రాష్ట్రలోని వైన్స్‌ షాపులకు కొత్త లైసెన్స్‌ లు మంజూరు చేసే ప్రక్రియపై ఫోకస్‌ పెట్టింది ఎక్సైజ్‌ శాఖ. అనని కుదిరితే ఆగస్టు తొలి వారంలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావిస్తోంది. లిక్కర్‌ షాపులకు లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించింది తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ప్రారంభించింది. వచ్చే రెండేళ్లకు సంబంధించిన లైసెన్స్‌ ప్రక్రియతో పాటు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ఉన్న పాలసీనే ఈసారి కూడా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆగస్టు 4వ తేదీన నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియపై ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు.ఆగస్టు తొలి వారంలోనే నోటిఫికేషన్‌ ఇచ్చి... దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉంది. పరిశీలన తర్వాత.... చివరి వారంలో లాటరీలు నిర్వహించి షాపులు కేటాయిస్తారని తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని సమాచారం. ఇక గతంలో మాదిరిగానే... ఈసారి కూడా గౌడ ఎస్సీ, ఎస్టీలతో పాటు గౌడ సామాజికవర్గానికి షాపుల కేటాయిపుల్లో రిజర్వేషన్లు కల్పిస్తారని తెలుస్తోంది.

 2021`23 సంవత్సరాలకు నూతన మద్యం పాలసీని చూస్తే... రిజర్వేషన్లను అమలు చేసింది తెలంగాణ సర్కార్‌. పాలసీలో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం కేటాయించింది. ఈసారికూడా ఇదే విధానంలో రిజర్వేషన్లు కొసాగించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడలకు 15 శాతం(363), ఎస్సీలకు 10 శాతం (262), ఎస్టీలకు రిజర్వేషన్‌ ప్రకారం షాపులు కేటాయించారు. వంద శాతం లాభాలతో నడిచే వ్యాపారమైన మద్యం దుకాణాలను స్థానికులకే కేటాయిస్తూ వస్తున్నారు. అన్ని విధాలుగా స్థానికులకు లాభాలు చేకూరే విధంగా నూతన మద్యం పాలసీని రూపొందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు రిజర్వేషన్‌ ప్రకారం 756 మద్యం దుకాణాలు కేటాయిస్తున్నారు. 1864 షాపులను ఓపెన్‌ కేటగిరీలో ఉంటాయి. గౌడ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మద్యం షాపులకు రిజర్వేషన్లుఅమలు చేస్తున్నారు. ఇక కొత్త జిల్లాలు యూనిట్‌గా మద్యం దుకాణాల కేటాయింపు జరగనుంది. ఆయా జిల్లాల్లో ఉన్న మద్యం దుకాణాల ఆధారంగా కలెక్టర్‌ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ వీటిని కేటాయించనుంది. కమిటీలో కలెక్టర్‌తో పాటు జిల్లా ఎక్సైజ్‌ అధికారి, గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమశాఖ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఉంటారు. డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు, వీడియో చిత్రీకరణను తప్పనిసరిగా ఉంటుంది.రిజిస్ట్రేషన్‌ ఫీజులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. స్లాబ్స్‌ కూడా గతంలో లాగానే ఆరు ఉండే ఛాన్స్‌ ఉంది.కమిటీలో కలెక్టర్‌తో పాటు జిల్లా ఎక్సైజ్‌ అధికారికమిటీలో 
 లైసెన్స్‌ ఫీజులో కూడా మార్పు ఉండదని ఎక్సైజ్‌ వర్గాల మేరకు తెలుస్తోంది. 5 వేల జనాభా వరకు 50 లక్షల లైసెన్స్‌ ఫీజు, 5 వేల నుంచి 50 వేల జనాభా వరకు 55 లక్షల ఫీజు, 50 వేల నుంచి లక్ష జనాభా వరకు 60 లక్షల ఫీజు, లక్ష నుంచి 5 లక్షల జనాభా వరకు 65 లక్షల ఫీజు ఉంటుంది. ఇక 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు 85 లక్షల ఫీజు ఉంటుంది. 20 లక్షల పై జనాభా ఉంటే కోటి పది లక్షలు లైసెన్స్‌ ఫీజు ఏడాదికి ఉంటుంది. ఏమైనా మార్పులు ఉంటే.. అధికారికంగా వచ్చే ఉత్తర్వుల్లో పేర్కొనే అవకాశం ఉంది. మద్యం దుకాణాల యజమానులకు 2021 నుంచి బ్యాంకు గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. గతంలో రెండు బ్యాంకుల గ్యారెంటీలు  ఇవ్వాల్సి ఉండగా, 2021 నుంచి ఒకటే గ్యారెంటీ తీసుకుంటోంది. దరఖాస్తు ఫీజు, లైసెన్స్‌ ఫీజు అంతకుముందు లాగే అమలు చేస్తోంది. ప్రివెలన్స్‌ ఫీజు కూడా ఏడిరతల నుంచి పదింతలు చేసింది. లైసెన్స్‌ ఫీజు స్లాబులను 8 నుంచి 12కి పెంచింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు