శ్రీహరికోట ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ );అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ఏర్పడిరది. అంతరిక్షంలో ఉపగ్రహాలకు చెందిన వ్యర్ధాలు ఎక్కువయ్యాయి. ఇస్రో దీనిపై ఇటీవల ఓ స్టడీ చేసింది. స్పేస్లో దాదాపు 27వేల వస్తువులు ఉన్నట్లు గ్రహించింది. దీంట్లో 80 శాతం వరకు ఉపగ్రహ శిథిలాలే ఉంటాయని ఇస్రో పేర్కొన్నది. 10 సెంటీవిూటర్ల కన్నా తక్కువ సైజ్లో ఉన్న వస్తువులు దాదాపు లక్షల సంఖ్యలో ఉంటాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు.యాంటీ శాటిలైట్ పరీక్షల ద్వారా ఏర్పడిన అంతరిక్ష వ్యర్ధాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఇస్రో అంచనా వేసింది. చైనా, అమెరికా, ఇండియా, రష్యాకు చెందిన పరీక్షల వల్ల ఆ వ్యర్ధాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతరిక్షంలో వ్యర్ధాలన్నీ జామ్ కావడం వల్లే.. జూలై 30వ తేదీన నిర్వహించిన పీఎస్ఎల్వీ పరీక్ష ఆలస్యమైందని ఇస్రో పేర్కొన్నది.శ్రీహరికోటపై ఉన్న అంతరిక్ష ప్రాంతంలో వ్యర్ధాలు చాలా ఉన్నాయని, అందుకే రాకెట్ ప్రయోగాన్ని ఒక నిమిషం ఆలస్యంగా నిర్వహించామని ఇస్రో చీఫ్ తెలిపారు. ఉదయం 6.30 నిమిషాలకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని.. ఉదయం 6.31 నిమిషాలకు చేపట్టామన్నారు. 500 కిలోవిూటర్ల దూరంలో ఉన్న భూకక్ష్యలో స్పేస్ వస్తువులు జామైనందు వల్లే ఆ ప్రయోగం ఆలస్యం జరిగిందని సోమనాథ్ తెలిపారు.యూఎస్ స్పేస్ కమాండ్ అంచనా ప్రకారం 10 సెంటీవిూటర్ల సైజు కన్నా పెద్ద సైజులో 26,783 అంతరిక్ష వ్యర్ధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 40 శాతం స్పేస్ వ్యర్ధాలు అమెరికాకు చెందినవే ఉన్నాయి. ఇక రష్యాకు చెందినవి 28 శాతం, చైనాకు చెందినవి 19 శాతం ఉన్నట్లు ఇస్రో తన రిపోర్టులో తెలిపింది. ఇండియా వల్ల ఏర్పడిన అంతరిక్ష వ్యర్ధాలు 217 వస్తువులు మాత్రమే, అంటే అది కేవలం 0.8 శాతం మాత్రమే అని ఇస్రో తన రిపోర్టులో వెల్లడిరచింది.
అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్.. అందుకే పీఎస్ఎల్వీ పరీక్ష ఆలస్యం: ఇస్రో
సోమవారం, ఆగస్టు 07, 2023
0
Tags