ఇస్లామాబాద్ ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ); తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలారు. ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆ కేసులో ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అక్రమ పద్ధతిలో ఇమ్రాన్ బహుమతుల్ని అమ్ముకున్నట్లు తేల్చారు. ఇమ్రాన్‌కు ఈ కేసులో లక్ష రూపాయాల జరిమానా విధించారు. ఇమ్రాన్‌పై నమోదు అయిన ఆరోపణలు రుజువైనట్లు ఇవాళ విచారణ సమయంలో అదనపు జిల్లా మరియ సెషన్స్ జడ్జి హుమాయున్ దిలావర్ పేర్కొన్నారు.ఎన్నికల సంఘానికి ఇమ్రాన్ కావాలనే తప్పుడు వివరాలను వెల్లడిరచినట్లు కోర్టు తెలిపింది. ఎలక్షన్ చట్టంలోని 174వ సెక్షన్ ప్రకారం కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల అమలు కోసం కాపీ ఆర్డర్‌ను ఇస్లామాబాద్ పోలీసు చీఫ్‌కు పంపించాలని జడ్జి దిలావర్ తెలిపారు.దోషిగా తేలిన ఇమ్రాన్‌ను లాహోర్‌లో అరెస్టు చేశారు. కోట్ లక్పత్ జైలుకు ఆయన్ను తరలిస్తున్నట్లు పంజాబ్ పోలీసులు వెల్లడిరచారు. జమాన్ పార్క్ కు భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు ప్రత్యేక వాహనంలో ఆయన్ను జైలుకు తరలించారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలుశిక్ష
శనివారం, ఆగస్టు 05, 2023
0
Tags